SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » Dragon Blood Tree Full Details In Telugu

Dragon Blood Tree: ఇదెక్కడి వింత.. చెట్టు నుంచి రక్తం కారుతోంది.. ఎందుకిలా!

  • Written By: Dharani
  • Updated On - Thu - 9 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Dragon Blood Tree: ఇదెక్కడి వింత.. చెట్టు నుంచి రక్తం కారుతోంది.. ఎందుకిలా!

మన దగ్గర అప్పుడప్పుడు వేప చెట్టు నుంచి పాలు కారడం, వినాయకుడు విగ్రహం పాలు తాగడం వంటి వింతలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి సంఘటనల గురించి విన్నప్పుడు వెంటనే మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానం గుర్తుకు వస్తుంది. భూమి అంతం అయిపోతుందనే మాట కూడా వినిపిస్తుంది. ఈ కోవకు చెందిన వింత సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని గురించి తెలిసిన వారంతా ఇదేం విడ్డూరం అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకు ఆ వింత సంఘటన ఏంటంటే.. చెట్టు నుంచి రక్తం కారుతుంది. చెట్టు నుంచి రక్తం కారడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. ఇది చదవండి. సాధారణంగా ఏదైనా చెట్టు లేదా మొక్కను కోస్తే తెల్లని పదార్థం లేదా నీరు, జిగురులాంటి పదార్థం వస్తుందనే సంగతి తెలిసిందే. అయితే, ఈ చెట్టును కొడితే మాత్రం రక్తం.. ప్రవాహంలా కారిపోతోంది. అదేం చిత్రం.. అలా ఎందుకు జరుగుతోందో తెలియాలంటూ ఈ డ్రాగన్ బ్లడ్ ట్రీ గురించి తెలుసుకోవల్సిందే.

ఈ డ్రాగన్ బ్లడ్ ట్రీ నుంచి రక్తం కారడాన్ని చూసి చాలామంది.. దాన్ని దెయ్యాల చెట్టుగా భావించేవారు. ఆ చెట్టును ముట్టుకుంటే చనిపోతారని చెప్పేవారు. దీంతో చాలామంది ఆ చెట్టును ముట్టుకోలేదు. అయితే, మరికొందరు మాత్రం అలాంటి చెట్లు తమ ప్రాంతంలో ఉండటం ప్రమాదకరమనే ప్రచారం చేశారు. దీంతో చాలామంది ఆ చెట్లను కొట్టేశారు. ఫలితంగా ఆ చెట్లు అరుదైన వృక్ష జాతుల్లో ఒకటిగా మిగిలిపోయాయి.

 from Tree

ఇది కూడా చదవండి: Uttar Pradesh: ఫోటో గ్రాఫర్ రాలేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు!

ఇంతకు అది రక్తమేనా..

ఎర్రగా ఉండే ద్రవాలన్నీ రక్తం కాదనే సంగతి మనకు తెలిసిందే. కానీ, ఆ చెట్టు నుంచి వచ్చే ఎర్రని ద్రవాన్ని చూస్తే మీరూ అదే అనుకుంటారు. వామ్మో.. చెట్టేంటి రక్తం కారుస్తుందని అంటారు. వాస్తవానికి ఆ చెట్టు నుంచి వచ్చేది రక్తం కాదు. అది ఆ చెట్టులో ఉండే ఎర్రటి జిగురు. అయితే, అది ఎక్కువ పలుచగా ఉండటం వల్ల.. కత్తిరించగానే రక్తంలా కారుతుంది. శాస్త్రీయంగా దీన్ని డ్రాసేనా సిన్నాబెర్రా (Dracaena cinnabari) అని పిలుస్తారు. ఈ చెట్టు అరేబియా సముద్రంలో యెమెన్ తీరంలో సోకోట్రా ద్వీపసమూహంలో మాత్రమే పెరుగుతుంది.

ఔషద గుణాలు మెండు..

‘డ్రాగన్ బ్లడ్ ట్రీ’లో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయట. పూర్వికులు దీన్ని ‘సిన్నబార్’ అని పిలిచేవారట. క్రీస్తు శకం 60వ శతాబ్దం నుంచి ఈ చెట్టుతో అనేక వ్యాపారాలు చేసేవారట. ఈ చెట్టు నుంచి వచ్చే సహజమైన ఎరుపు జిగురును లిప్‌స్టిక్, వయోలిన్ వార్నిష్‌ల కోసం ఉపయోగించేవారు. ఈ చెట్టు 18 మీటర్లు (60 అడుగులు) కంటే ఎక్కువ పొడవు, 6 మీటర్లు (20 అడుగులు) వెడల్పుతో పెరుగుతుంది. ఇది 650 సంవత్సరాల వరకు జీవించగలదు. డ్రాగన్ చెట్ల కొమ్మలు ఒక పెద్ద పుట్టగొడుగు లేదా గాలి గొడుకు తరహాలో ఉంటాయి.

ఇది కూడా చదవండి: Abdul Sattar Success Story: డెలివరీ బాయ్‌ టు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. కష్టాలనుంచి విజయం…

 from Tree

ఈ చెట్టు నుంచి విడుదలయ్యే ఎరుపు రసాన్ని లేదా రెసిన్‌ను డ్రాగన్ రక్తం అని పిలుస్తారు. మీరు ఈ చెట్టును కత్తిరించినట్లయితే ఎర్రటి రెసిన్ బయటకు వస్తుంది. ఇది రక్తస్రావం తరహాలోనే ఉంటుంది. అంతేకాదు ఈ చెట్టుకు కాసే పండ్లు కూడా చాలా విలువైనవి. వాటిని ‘డ్రాగన్ బ్లడ్ ట్రీ బెర్రీస్’ అంటారు. పశువులను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ బెర్రీలు ఉపయోగపడతాయట. ప్రస్తుతం ఈ జాతి చెట్లు ప్రమాదంలో ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఈ చెట్లు క్రమేనా అంతరించిపోతున్నాయి. ఇప్పుడు పెరుగుతున్న చెట్లు గొడుగు ఆకారంలో ఉండటం లేదు.

ప్రస్తుతం అంతరించి పోయే స్థితిలో..

2008లో ఈ చెట్లు పెరుగుతున్న సోకోత్రా ద్వీపసమూహ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. కానీ, ఈ ప్రాంతంలోని చెట్లు దాదాపు ఎండిపోతున్న పరిస్థితిలో ఉన్నాయి. గ్లోబల్ ట్రీస్ నివేదికల ప్రకారం.. డ్రాగన్ బ్లడ్ చెట్టు 2080 నాటికి 45% వరకు నశించిపోయే అవకాశం ఉంది. స్కుండ్ నేచర్ అభయారణ్యం విస్తరించినట్లయితే ఈ చెట్లు మరింత కాలం జీవించే అవకాశం ఉంది. లేకపోతే ఈ రక్తం కారే చెట్టు గురించి పుస్తకాల్లో చదువుకోవలసి వస్తుంది. మరి ఈ వింత చెట్టు గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.


ఇది కూడా చదవండి: Video: పాపం ఎంగేజ్ మెంట్ రోజే అల్లరిపాలయ్యాడు..!

Tags :

  • dragon blood
  • tree
  • viral news
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

  • రైలు చక్రాలకు, పట్టాలకు కలిపి తాళం వేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

    రైలు చక్రాలకు, పట్టాలకు కలిపి తాళం వేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

  • లవ్ ఎట్ ఫస్ట్ సైట్ : 76 ఏళ్ల వ్యక్తిని మనువాడిన 46 ఏళ్ల మహిళ

    లవ్ ఎట్ ఫస్ట్ సైట్ : 76 ఏళ్ల వ్యక్తిని మనువాడిన 46 ఏళ్ల మహిళ

  • చదువుకుంది.. కానీ ఏకంగా దేవుడ్ని పెళ్లాడి వార్తల్లో నిలిచింది

    చదువుకుంది.. కానీ ఏకంగా దేవుడ్ని పెళ్లాడి వార్తల్లో నిలిచింది

  • ఇలాంటి భర్తే కావాలనుకుంటున్న అమ్మాయిలు.. ఇంతకు ఏం చేశాడంటే..?

    ఇలాంటి భర్తే కావాలనుకుంటున్న అమ్మాయిలు.. ఇంతకు ఏం చేశాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam