క్యాన్సర్.. 20 ఏళ్ల క్రితం వరకు ఇదో ప్రాణాంతక రోగం. క్యాన్సర్ వచ్చిందంటే ప్రాణం పోవాల్సిందే అన్నట్లు ఉండేది. సరైన చికిత్స కూడా అందుబాటులో ఉండేది కాదు. తర్వాతి కాలంలో మంచి చికిత్సలు, మందులు అందుబాటులోకి వచ్చాయి. సరైన సమయంలో వ్యాధిని గుర్తించగలిగితే క్యాన్సర్‌నుంచి పూర్తిగా బయటపడొచ్చు. అయితే, మనుషుల్లో కూడా క్యాన్సర్‌ను సరైన సమయంలో గుర్తించటం చాలా కష్టంగా మారింది. అలాంటిది జంతువుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని పెంపుడు జంతువుల సంగతి పక్కన పెడితే.. వీధి జంతువులకు ఏదైనా రోగం వస్తే ప్రాణాలు పోవాల్సిందే. అయితే, అప్పుడప్పుడు అత్యంత అరుదైన ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి.
ఈ ఘటనల్లో ఏదైనా గాయం లేదా రోగం కారణంగా ప్రాణాలతో పోరాడున్న జంతువులకు వైద్యం అందించటం జరుగుతూ ఉంది. తాజాగా, కర్ణాటకలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ పాముకు శస్త్ర చికిత్స అందించాడు ఓ వైద్యుడు. ట్యూమర్‌ను ఆపరేషన్ చేసి తొలగించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ధార్వాడకు చెందిన సోమశేఖర్ చలశెట్టి అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం తలపై గాయంతో ఉన్న ఓ పామును చూశాడు. దాన్ని పట్టుకుని వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. వెటర్నరీ డాక్టర్ అనిల్ కుమార్ పాటిల్ దాని గాయానికి పరీక్షలు చేశారు.
దీంతో అది క్యాన్సర్ ట్యూమర్‌గా తేలింది. క్యాన్సర్ ట్యూమర్ బాగా పెరిగిపోయి తలపైకి ఉబ్బి వచ్చిందని గుర్తించారు. వెంటనే క్యాన్సర్ ట్యూమర్‌కు ఆపరేషన్ చేశారు. ట్యూమర్‌ను తొలగించారు. ప్రస్తుతం ఆ పాము ఆరోగ్యం నిలకడగానే ఉంది. దాని ఆరోగ్యం పూర్తిగా బాగైన తర్వాత అడవిలో వదలిపెడతామని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాముకు క్యాన్సర్ ట్యూమర్ ఆపరేషన్ చేయటం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సదరు డాక్టర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరి, పాముకు క్యాన్సర్ ట్యూమర్ ఆపరేషన్ నిర్వహించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Cancer Operation To Snake In Dharwad pic.twitter.com/by4PbKEQB4
— venky bandaru (@venkybandaru13) December 30, 2022