తమకు పుట్టబోయే బిడ్డ చక్కగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క దంపతులు కోరుకుంటారు. దానికి కోసం ఆ దంపతులు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. దీంతో పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. కానీ కొన్ని సందర్భాల్లో కొందరు పిల్లలు పుట్టుకతోనే అరుదైన సమస్యలతో జన్మిస్తారు. ఎవరో డబ్బున్న మహరాజుల బిడ్డలకు ఈ సమస్య వస్తే.. దేశ దేశాలు తిరిగి వ్యాధిని నయం చేయించుకుంటారు. మరి.. మిగిలిన వారి కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే. ఆ తల్లిదండ్రులు మనోవేదనతో రోజులు గడుపుతుంటారు. తాజాగా భవ్యశ్రీ అనే చిన్నారి అరుదైన సమస్యతో జన్మించింది. అందరికి గుండె ఎడమ వైపు ఉంటుంది. కానీ ఈ చిన్నారికి మాత్రం కుడి వైపు ఉంది. అంతే కాకా అందరికి రెండు ఊపిరితిత్తులు ఉంటే ఆ చిన్నారికి మాత్రం ఒక్కటే ఉంది. భవ్యశ్రీకి ఉన్న సమస్యపై ఆమె తల్లితో సుమన్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. మీరూ చిన్నారికి సంబంధించిన ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.