బాలీవుడ్ లో హీరోయిన్లు పెళ్లికి ముందే తల్లులవుతున్నారంటూ ఓ క్రిటిక్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే అందులో నిజమెంతో కానీ, ఈ మాటలను ఆచరణలో పెట్టి చూపించారు ఓ స్టార్ నటి. పెళ్లి కాకుండానే తల్లయిన ఈ బ్యూటీ.. మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటారనే లోపు షాక్ నిచ్చింది.
సినీ పరిశ్రమలో బాలీవుడ్ హీరోయిన్ల విషయంలో ఓ ట్రెండ్ నడుస్తోంది. ముందు ప్రెగ్నెంట్ కావడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం. ఈ మాట మేమనడం లేదండీ. బాలీవుడ్ క్రిటిక్, నటుడు కమల్ ఆర్ ఖాన్ అన్నమాట. ఇటీవల పెళ్లి చేసుకున్న కియారా-సిద్ధార్థ్ మల్హోత్రాలపై ఆయన ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. పెళ్లైన ఏడు నెలలకే ఆలియా-రణబీర్ కపూర్ దంపతులకు ఓ బిడ్డ జన్మించడంతో ఆ వ్యాఖ్యలు అనుమానం పుట్టించేలా చేశాయి. ఇవన్నీ అధికారికంగా నిర్దారించలేము కానీ. వీరి కన్నా ముందే పెళ్లి కాకుండా తల్లయి వార్తలో నిలిచింది అందాల ముద్దుగుమ్మ అమీ జాక్సన్ అలియాస్ ఎమీ జాక్సన్.
ఐరిష్ సముద్రంలోని ఐస్లే ఆఫ్ మానే అనే చిన్న ద్వీపంలో పుట్టిన ఈ బ్యూటీ.. బ్రిటన్‌లో పెరిగింది. ఖండాంతరాలు దాటి భారత్ కు వచ్చింది. మోడల్ నుండి నటిగా మారింది. 2010లో తమిళ సినిమా మద్రాసు పట్టణంతో సినిమాలోకి అడుగుపెట్టిన ఈ చిన్నదీ తెలుగు (ఎవడు), హిందీ, ఇంగ్లీషు భాషల్లో 15 సినిమాల్లో నటించింది. 2018 ఐ సినిమా తర్వాత సినిమాలకు సడెన్ బ్రేక్ ఇచ్చింది. తీరా చూస్తే అభిమానులకు షాక్ నిస్తూ బ్రిటన్ వ్యాపార వేత్త, మోడల్, నటుడు జార్జ్ పనాయోటోతో లవ్ లో పడి.. గర్భం దాల్చంది. ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక అతడితోనే వివాహం జరుగుతుందని అందరూ భావించారు. కానీ అంతలోనే మరో షాక్ నిచ్చింది ఈ ఐ సుందరి.
తన ప్రియుడు, కుమారుడికి తండ్రి అయిన జాక్సన్ జార్జ్‌కు బ్రేకప్ చెప్పేసింది. ఇప్పుడు విదేశీ నటుడు తో డేటింగ్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ ఇటీవల ప్రేమికుల రోజున ఓ పోస్టు పెట్టింది. హ్యాపీ వాలంటైన్స్ డే బేబీ, నీ అంతులేని ప్రేమకు కృతజ్షతలు అని లవ్ సింబల్ జోడించింది. అతడితో దిగిన రొమాంటిక్ ఫోటోలతో పాటు పలు ఆసక్తికర ఫోటోలను షేర్ చేసుకుంది. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో తనకు సంబంధించిన, తన కుమారుడికి సంబంధించిన ఫోటోలను అమ్మీ జాక్సన్ పోస్టు చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలను చూసిన వారంతా లవ్ సింబల్స్ ను జోడిస్తున్నారు. వీటిని చూసిన మరికొంత మంది ఏంట్రా బాబూ ఈ చెండాలం అని భావిస్తున్నారు. క్రిటిక్స్ అన్నట్లు పెళ్లికాక ముందే హీరోయిన్లు తల్లులవుతున్నారంటారా..? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.