గుండెపోటు.. ఈ మధ్యకాలంలో ఈ సమస్య వయసు తేడా లేకుండా ప్రతీ ఒక్కరినీ వెంటాడుతుంది. 6 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్దుల వరకు ఇలా ప్రతీ ఒక్కరు రోజుకొక చోట గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా హరియాణాలో ఓ యువకుడు మెడికల్ షాపుకు మందులు కొనడానికి వచ్చాడు. ఇక అందరూ చూస్తుండగానే గుండెపోటుతో క్షణాల్లో అక్కడికక్కడే కిందపడి పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ వీడియోను చూసిన చాలా మంది భయంతో వణికిపోతున్నారు.
విషయం ఏంటంటే? హరియాణా ఫిరిదాబాద్ ఇటావా ప్రాంతంలో సంజయ్ అనే 23 ఏళ్ల యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతనికి గుండెలో ఏదో నొప్పిగా అనిపించింది. ఇతంతా మాములే అనుకుని కొద్దిసేపు అలాగే ఉండిపోయాడు. కానీ రాను రాను ఆ నొప్పి విపరీతంగా రావడంతో తట్టుకోలేకపోయాడు. ఇక చేసేదేం లేక ఆ యువకుడు వెంటనే పక్కనే ఉన్న ఓ మెడికల్ షాపుకు ఓఆర్ఎస్ కోసం వెళ్లాడు. ఆ షాపులో ఉన్న అతడికి చె్ప్పి అక్కడే కొద్దిసేపు నిలిచున్నాడు. కానీ అప్పటికే గుండెలో అతడికి తట్టుకోలేనంతంగా విపరీతమైన నొప్పి వస్తుంది. ఇక ఓఆర్ఎస్ తీసుకున్న ఆ యువకుడు వెళ్దామని ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు.
క్షణాల్లో అందరూ చూస్తుండగానే గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన ఆ మెడికల్ షాపులో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ఆ యువకుడిని లేపే ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకపోవడంతో అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. మెడికల్ షాపు ముందు అతడు గుండెపోటుతో కుప్పకూలిపోతున్న దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక ఇదే విడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Man got heart attack while taking ORS at Medical store, died on the spot in Faridabad, Haryana. 👇#Faridabad #Haryana #HeartAttack #Health #BreakingNews #ViraqlVideo #India #IndiaNews pic.twitter.com/80y2bkVzy0
— Free Press Journal (@fpjindia) January 6, 2023