సాధారణంగా సంక్రాంతి పండుగ టైంలో మనం గాలిపటం(Kite) అనేది గాలిలో ఎగరటం మాత్రమే చూస్తుంటాం. అప్పుడప్పుడు గాలిపటం ఎగరవేయటంలో కొన్నిసార్లు ఆశ్చర్యపోయే సన్నివేశాలు.. నోరు తెరిచి కళ్లప్పగించే దృశ్యాలు ఎదురు పడుతుంటాయి. కానీ గాలిపటం లాగే మనిషి కూడా గాలిలో ఎగరటం చూసారా? అదికూడా దాదాపు 1 నిమిషం పాటు గాలిలో(సుమారు 30 అడుగుల ఎత్తులో) ఉండటం అంటే మాములు విషయం కాదు.
నమ్మడానికి కష్టంగా అనిపించినా.. ఈ వీడియో చూస్తే నమ్మక మానరు. ఈ దృశ్యం శ్రీలంక దేశంలోని జఫ్నా జిల్లా, పాయింట్ పెడ్రో ప్రాంతంలో జరిగింది. ప్రస్తుతం ఓ కుర్రాడు తాడు పట్టుకొని గాలిలో ఎగిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.