శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. మల్లన్న దర్శనానికి 20 మంది ప్రయాణికులతో బయలు దేరిన ఓ బస్సు బోల్తా పడింది.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొందరు భక్తులు ఓ ప్రైవేట్ బస్సులో శ్రీశైలం మల్లన్న దర్శనానికి బయలుదేరారు. శనివారం దోర్నల ప్రధాన హైవే పై వెళ్తుండగా ఆ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యయి. వెంటనే స్పందించిన వాహనదారులు 108కి కాల్ చేసి గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయందోళనలకు గురయ్యారు. ఇక వైద్యులు గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అసలేం జరిగిందంటే?
స్థానికుల సమాచారం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన చాలా మంది శ్రీశైలంలో ఉన్న మల్లన్న స్వామిని దర్శించుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల శ్రీశైలానికి బయలు దేరారు. ఇక శనివారం దోర్నాల శ్రీశైలం ప్రధాన ఘాట్ రోడ్డులోని దయ్యాల టర్నింగ్ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరు వెంటనే స్పందించి 108కి కాల్ చేశారు. అంబులెన్స్ అక్కడికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయందోళలనకు గురయ్యారు.