మగవారు.. తోటి మగవారితో ఎక్కడైనా మసాజ్ చేపించుకుంటారా! ఛీ.. ఛీ అంటారు. అందుకే వీరు అందరిలా కాకుండా, మూడో కంటికి తెలియకుండా ఆడవారితో మసాజ్ చేపిస్తున్నారు. గంటకు ఎంత తీసుకుంటారనేగా.. మీ డౌట్! ఎంపిక చేసుకునే మసాజ్ రకాన్ని బట్టి గంటకు రూ.1500 అట.. మొత్తానికి వీరి చీకటి బాగోతం పోలీసుల కంట పడింది..
‘యూ వాంట్ మసాజ్.. ఆయిల్ మసాజ్, బాడీ మసాజ్, థాయ్ మసాజ్..‘ అంటూ చిరుత మూవీలో అలీ చెప్పిన డైలాగ్ గుర్తుంది కదూ. ఇలానే ఓ పోలీస్ సిబ్బంది మసాజ్ కావాలని లోపలకి వెళ్ళగానే పార్లర్ లో పనిచేస్తున్న రకరకాల పేర్లు చెప్పారట. అక్కడకి వచ్చింది పోలీస్ అని వారి తెలియదు.. అందుకే అలీ చెప్పినట్లు ఓ నాలుగైదు రకాల మసాజుల పేర్లు చెప్పారట. ఎంత తీసుకుంటారు అని అతను అడగ్గా.. ఎంపిక చేసుకునే రకాన్ని బట్టి గంటకు రూ.1500 అన్నారట. అతడు సరే అనగానే.. లోపలకి పదా! అన్నారట. అంతే లోపలకి వెళ్ళగానే పోలీసుల ఎంట్రీ. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
షాద్ నగర్‌లోని ఫ్రెండ్ ప్రొఫెషనల్ మసాజ్ సెంటర్ లో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో వారు గత కొద్ది రోజులుగా ఈ మసాజ్ సెంటర్ పై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో పోలీసులు నేడు తమ సిబ్బందిలో ఒకరిని రహస్యంగా ఫ్రెండ్ ప్రొఫెషనల్ మసాజ్ సెంటర్ కి పంపి మసాజ్ చేయాలని కోరగా వారు, అందుకు అంగీకరించారు. పైగా ఓ నాలుగైదు రకాల మసాజుల పేర్లు.. గంటకు రూ.1,500 రూపాయలు ఛార్జ్ అన్నారట. దీంతో పోలీసులు ఆ సెంటర్ పై దాడి చేసి ముగ్గరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం ముందుగానే పసిగట్టిన మసాజ్ సెంటర్ నిర్వాహకులు అక్కడినుండి తప్పించుకున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నిర్వాహకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
షాద్ నగర్‌లో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న మసాజ్ సెంటర్ పై పోలీసుల దాడులు
ఆడవాళ్ళతో మసాజ్ చేయిస్తారని అందిన పక్కా సమాచారంతో పోలీసులు తమ సిబ్బందిలో ఒక్కరిని రహస్యంగా ఫ్రెండ్ ప్రొఫెషనల్ మసాజ్ సెంటర్ కి పంపి మసాజ్ చేయాలని కోరగా ఈ సెంటర్ పై దాడి చేశారు. ఒక గంటకు 1500 రూపాయలు… pic.twitter.com/AAz5LcAe4g
— Telugu Scribe (@TeluguScribe) May 4, 2023