గత కొంతకాలం క్రితం సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యహారం సంచలనం రేపిన సంగతి అందరికి తెలిసిందే. ఆ సమయంలో పలువురు సెలబ్రిటీలను పోలీసులు విచారణ జరిపి కీలక ఆధారాలు సేకరించారు. ఆ సమయంలో టాలీవుడ్ లో ప్రకంపనాలే రేగాయి. సినీ పరిశ్రమపై మరో సారి డ్రగ్స్ కేసుకి సంబంధించిన నీడలు కమ్ముకున్నాయి. ఇక మొన్నటిదాకా శాండిల్ వుడ్ లో కలకలం రేపిన ఈ డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో కూడా చాలా తీవ్రంగా పెను దూమారం రేపుతుంది. ఇటీవలే హైదరాబాద్ లోని ఓ పబ్ లో ఏపీ మాజీ మంత్రి సమీప బంధువు డగ్స్ తీసుకుంటుండగా పోలీసులు రెడ్ హ్యెండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ హీరోయిన్ ద్వారా ఈ డగ్ర్స్ సరఫరా జరిగినట్లు పోలీసుల గుర్తించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులో ఏపీ కి చెందిన ఓ మాజీ మంత్రి సమీప బంధువు మన్యం కృష్ణ కిషోర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మన్యం కృష్ణ కిషోర్ బంజారా హిల్స్ లోని ఓ పబ్ లో డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. అతడి తో పాటు ఇంటర్నేషనల్ డీజే ఈవెంట్ మేనేజర్ మైరాన్ మోహిత్ ను కూడా అరెస్ట్ చేశారు. మైరాన్ మోహిత్ పబ్ లో వెయిటర్ గా పనిచేస్తూ డ్రగ్స్ సప్లయర్ గా మారాడు. మోహిత్ గోవాతో పాటు సన్ బర్న్ పొగ్రాంలను ఏర్పాటు చేస్తున్నాడు. మోహిత్ దగ్గర వంద మంది డీజేలు ఉన్నట్లుగా గుర్తించారు. అలానే మరో ఇద్దరి నుంచి పోలీసులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తీసుకుంటుండగా అరెస్టైన కృష్ణ కిషోర్ రెడ్డి ప్రముఖ వ్యాపారిగా ఉన్నారు.
ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలతో మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. వారిలో కొందరికి కృష్ణ కిషోర్ రెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే బెంగళూరు నుంచి కృష్ణ కిషోర్ రెడ్డి బస్సుల్లో హైదరాబాద్‌కు డ్రగ్స్ తెప్పిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలోని పలు పబ్ లకు, అలాగే సినీ, వ్యాపారులకు వ్యాపారవేత్తలకు కిషోర్ రెడ్డి డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారు. బెంగుళూరు నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇది ఇలా ఉండే హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మైరాన్ మొహిత్ భార్య ప్రముఖ హీరోయిన్ నేహా దేశ పాండే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. ఈ కేసుపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నారు.