ఐపీఎస్ అధికారి సజ్జనార్.. TSRTC ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆర్టీసీ సంస్థను వినూత్న పంథాలో ముందుకు తీసుకుకెళ్తున్నారు. TSRTC సేవలను జనాలకు మరింత దగ్గర చేయడానికి టెక్నాలజీతో పాటు సోషల్ మీడియాను కూడా ఉపయోగిస్తున్నారు సజ్జనార్. ఆర్టీసీ అందిస్తున్న అన్ని సేవలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఆర్టీసీ ప్రయాణికులు కూడా బస్సు ప్రయాణంతో తమ అనుబంధాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రయాణికులు సైతం ఆర్టీసీ ప్రయాణంలో ఏర్పడే ఇబ్బందులు లేదా సలహాలను తెలిపేందుకు సోషల్ మీడియా ద్వారానే సజ్జనార్ దృష్టికి తీసుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదులకు సైతం సజ్జనార్ వీలైనంత త్వరగా స్పందిస్తుండటం విశేషం.
తెలంగాణ ఆర్టీసీని సరికొత్త రీతిలో ప్రమోట్ చేస్తున్న సజ్జనార్.. ప్రచారం కోసం సినిమా పాటలు, సన్నివేశాలను కూడా వినియోగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ జనాలకు ఏ విధంగా తమ సందేశాన్ని చేరవేయాలనే విషయంలో పక్కా క్లారిటీగా ఉన్నారు సజ్జనార్. ఇటీవల దృశ్యం సినిమాలో హీరో వెంకటేష్ ఫ్యామిలీ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వీడియో క్లిప్ ను షేర్ చేసి సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీని వినియోగించాలని సూచించిన సజ్జనార్.. తాజాగా మేడారం జాతరను ఉద్దేశించి మరో పోస్ట్ పెట్టారు.
#TSRTCBus లు అమ్మవార్ల గద్దెకు దగ్గరగా వెళ్ళును, Private Vehicles 5km దూరంలో నిలుప బడును #MedaramJathara కు విచ్చేస్తున్న అశేష భక్త జనానికి #TSRTC తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.@TSRTCHQ @baraju_SuperHit @urstrulyMahesh @MBofficialTeam @Medaramjathara @TV9Telugu @way2_news pic.twitter.com/lThN4Lxnh8
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) February 16, 2022
మేడారంలో కొలువైన సమ్మక్క సారక్క జాతరను పురస్కరించుకొని విచ్చేస్తున్న భక్త జనానికి శుభాకాంక్షలు తెలిపిన సజ్జనార్.. ‘ప్రైవేట్ బస్సులు మిమ్మల్ని సమ్మక్క సారక్క గద్దెలకు 5 కి.మీ దూరంలో దింపేస్తాయి. కాబట్టి హాయిగా ఆర్టీసీ బస్సులో వెళ్ళండి.. దేవతల గద్దెల దగ్గరే దిగండి’ అంటూ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట.. సినిమాలోని ఫోటోలు, డైలాగ్స్ ఉపయోగించి ట్వీట్ చేశారు. ‘సర్కారు వారి బస్సు‘ అంటూ వినూత్నంగా TSRTC ని ప్రమోట్ చేయడం ప్రస్తుతం విశేషంగా ఆకట్టుకుంటోంది. మరి సజ్జనార్ ‘సర్కారు వారి బస్సు’ కాన్సెప్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.