సమాజంలో ఎందరో అభాగ్యులు.. వారందరికి మనం సాయం చేయలేకపోవచ్చు.. కానీ వారి గురించి సమాజానికి తెలియజేస్తే.. ఆదుకోవడానికి ఎందరో ముందుకు వస్తారు. అలాంటి పనే చేస్తుంది సుమన్ టీవీ. జీవితంలో అన్ని కోల్పోయి.. బతుకు మీద ఆశ కోల్పోయిన వారికి బాసటగా నిలుస్తోంది. కష్టాలను చిరునవ్వుతో ఎదిరించిన వారి గురించి ప్రపంచానికి తెలియజేసి.. మరి కొందరిలో స్ఫూర్తి రగిలిస్తోంది. ఈ క్రమంలో 2021, నవంబర్ లో సుమన్ టీవీ సబిత అనే ఇంటర్ విద్యార్థిని గురించి ఓ వీడియో చేసింది. ప్రస్తుతం అది వైరల్ కావడమే కాక దానిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోన్న సబితను ఆదుకోవాల్సిందిగా నల్లగొండ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు కేటీఆర్. తాను కూడా వ్యక్తిగతంగా సబితను కలుస్తానని తెలిపారు.
Request @Collector_NLG Prashant Patil Garu to meet and assist this dynamic young lady
I will also meet her personally to see how best we can help her asap @KTRoffice please coordinate https://t.co/MVRMw2Vihp
— KTR (@KTRTRS) February 6, 2022
నల్లగొండ జిల్లా వంగమర్తి గ్రామానికి చెందిన సబిత జీవితం అప్పటి వరకు సంతోషంగా సాగిపోయింది. కానీ సబిత ఆరో తరగతి చదువుతున్నప్పుడు తండ్రి చనిపోయాడు.. తల్లికి అనారోగ్యం.. తనను తాను పోషించుకోవడమే కాక.. తల్లికి అండగా నిలవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఎవరైనా బెంబెలెత్తిపోతారు. ఆదుకునేవారు ఉంటే బాగుండు అని కోరుకుంటారు. కానీ సబిత మాత్రం.. కష్టాలకు ఎదురీదాలని భావించింది. ఆటో నేర్చుకుని నడపడమే కాక.. హోటల్ లో పని చేస్తుంది. కాలేజీకి వెళ్లి చదువుకుంటుంది. పని చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదంటుంది. తాను స్వశక్తితోనే ఎదుగుతానని ఎంతో నమ్మకంగా.. ఆత్మవిశ్వాసంతో చెబుతోంది సబిత. తనకు సాయం వద్దని.. ఆశీస్సులు చాలని అంటుంది. జీవితంలో చిన్న చిన్న కష్టాలకే కుంగిపోయేవారు సబితను చూసి ఎంతో నేర్చుకోవాలి. కరాటే కూడా నేర్చుకుంటున్నట్లు తెలిపింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..