హైదరాబాద్ లో గత మూడు రోజులుగా ముసురుతో కూడుకున్న వర్షం కంటిన్యూగా కురుస్తుంది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు అంటున్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మూడు రోజుల నుంచి వాన దంచికొడుతోంది.. దీంతో నగరంలో వర్షపాతం గణనీయంగా పెరిగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వారంతం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఈవీడీఎం భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలై 20 నాటికి సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..
గత మూడు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా ముసురుతో కూడిన వర్షాలు కురవడం మొదలయ్యాయి. మూడు రోజులుగా ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరయడంతో ప్రజలలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. కొన్నిచోట్ల కిలోమీటర్ల మేర వాహనదారులు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోతున్నారు. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది పాత భవనాలను ఖాళీ చేయిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో సాధారణంగా ప్రతి ఏడాది జూలై 20 నాటికి సగటున 101.2 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదు అవుతుంది. కానీ ఈ ఏడాది మాత్రం సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదు అయ్యింది. ఏకంగా 122.4 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ షేక్ పేటలో 6.6 సెం.మీ, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 7.3 సెం.మీ, ఖైరతాబాద్ లో 4.7 సెం.మీ, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా కుకట్ పల్లిలో 5.6 సెం.మీ, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు లో 4.5 సెం.మీ, కుత్బుల్లాపూర్ 4.7 సెం.మీ, మియాపూర్‌లో 7.38 సెం.మీ, హైదర్‌నగర్ 5.68 సెం.మీ, టోలీచౌకి 6.65 సెం.మీ, మూసాపేట 4.73 సెం.మీ, మాదాపూర్ 5 సెం.మీ, కేపీహెచ్‌బీ 4.95 సెం.మీ, జూబ్లీహిల్స్ 4.65 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదు అయ్యింది. ప్రస్తుతం ఎండిఆర్ఎస్ బృందాలు రోడ్లపైకి వచ్చి వర్షపు నీటిని రోడ్లపై నిల్వకుండా జాగ్రత్తపడుతున్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.
#20JULY 5:10PM⚠️
Well No Break Nothing, Moderate/Heavy rains Started Covering City very Fastly.
As Night Progresses Rain Intensity will increase further & Further,STAY HOME…STAY SAFE⚠️⚠️⚠️#HyderabadRains pic.twitter.com/5LpDMmHNTC
— Hyderabad Rains (@Hyderabadrains) July 20, 2023