Hyderabad News : హైదరాబాద్‌లోని వనస్థలీపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కుక్క నోట్లో శిశువు తల కనిపించి అందర్నీ షాక్‌కు గురి చేసింది. వివరాలు.. ఆదివారం ఉదయం వనస్థలీపురంలోని సహారా కాలనీకి చెందిన కార్తీక్ పాల బూతు దగ్గర ఉన్నాడు. ఓ కుక్క.. నోట్లో శిశువు తలతో అతడి ముందు వెళుతూ కనిపించింది. అది చూసిన అతడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆ వెంటనే తన పక్కన ఉన్న వాళ్లను అలర్ట్ చేశాడు. వారు ఆ కుక్కను వెంబడించారు. దీంతో అది కొద్దిసేపు పరిగెత్తి తలను పొదల్లో వదిలేసి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిశువు తలను స్వాధీనం చేసుకున్నారు.
అది 3-4 రోజుల శిశువు తల అయిఉండొచ్చని తెలిపారు. మొండాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. శిశువు తల్లిదండ్రులు శవాన్ని సరిగా పూడ్చక పోవటం వల్లే కుక్కలు గొయ్యిని తవ్వి శవాన్ని బయటకు తీసి ఉంటాయని, తలను మొండెం నుంచి వేరుచేసి పక్కకు తెచ్చుంటాయని అభిప్రాయపడుతున్నారు. అయితే, మరో వైపు పలు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కుక్క తలను ఎక్కడినుంచి తీసుకువచ్చింది అన్నది తెలుసుకుంటున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అభిమాన హీరో సినిమా బాగాలేదని.. యువకుడి ఆత్మహత్య
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.