ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలో నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి కి సంబందించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో కరాటే కళ్యాణి వరుస కష్టాలు వచ్చిపడుతున్నాయి. ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో దావాణంలా వ్యాపించింది. సోదాలు నిర్వహించిన అధికారులు కరాటే కల్యాణి ఇంట్లో ఒక చిన్నారిని గుర్తించారు. ఇటీవల ఆమె చట్ట విరుద్దంగా చిన్నారులను తన ఇంట్లో ఉంచుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆమె ఇంటిని సోదా చేసినట్లు తెలుస్తుంది.
ఇటీవల శ్రీకాంత్ రెడ్డితో కరాటే కళ్యాణికి పెద్ద గొడవ జరిగింది.. ఆ సమయంలో తనతోపాటు చిన్నారి కూడా ఉంది. ప్రస్తుతం అధికారులు ఆ చిన్నారులు ఎవరు.. ఎక్కడ నుంచి వచ్చారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కరాటే కళ్యాణికి పిల్లలు లేరు కదా.. మరి ఆ చిన్నారులు ఎవరు అన్న విషయంపై అధికారులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. వాటికి సంబందించిన సంబంధించిన డాక్యూమెంట్స్ వెరిఫై చేస్తున్నారు.
శ్రీకాంత్ రెడ్డితో గొడవ జరిగిన తర్వాత సోషల్ మీడియాలో వీరి గురించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. శ్రీకాంత్ కొంత కాలంగా ఫ్రాంక్ వీడియోలు అంటూ అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నాడని.. అతని వల్ల చాలా మంది మానసికంగా ఇబ్బంది పడ్డారన్న విషయంపై శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసింది కరాటే కళ్యాణి. వీరిద్దరి మద్య గొడవలు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. ఇరువురిపై కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయం పై రగడ కొనసాగుతూనే ఉండగా ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.