సాధారణంగా బిర్యానిని ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. ఇక కొందరు భోజన ప్రియులు అయితే రోజూ బిర్యానిని తింటుంటారు. సీటీలలో ఎక్కువ మంది బిర్యానినే తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే కుటుంబంతో రెస్టారెంట్ కి వెళ్ళిన బిర్యాని నే ఎక్కువుగా తింటూ ఉంటారు. అయితే ఒక ప్లేట్ బిర్యానీ తినాలంటే కనీసం రూ.100 ఉంటుంది. అదే రెస్టారెంట్ లోకి వెళ్లి తినాలంటే రూ.240, ఇంక పెద్ద రెస్టారెంట్లకు వెళ్తే.. బిర్యానీ రేటు ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాంటి పరిస్థితులు బిర్యానీ తినడానికి సామాన్యులు ఆలోచిస్తారు. కానీ ఒక చోట మాత్రం బిర్యానీ కేవలం పది రూపాయలకే లభిస్తుంది. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. మరి.. ఆ రూ.10కే బిర్యానీ లభించే ప్రాంతం ఎక్కడో, ఆ బిర్యానీ విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్ లోని అప్ఝల్ గంజ్ బస్టాండ్ లో ప్రాంతంలో ఇప్తికార్ మొమిన్ అనే పెద్దాయన రూ.10కే బిర్యానీ అందిస్తున్నారు. ఈయన ఈ ఫుడ్ స్టాల్ను ఓ టేబుల్… కొన్ని గిన్నెలతో పదేళ్ల క్రితం ప్రారంభించారు. అప్పట్లో ఇదే వెజ్ బిర్యానీని రూ.5 చొప్పున అమ్మారు. ధరలు పెరుగుతుంటే… ఆయన కూడా కాస్త పెంచుతూ ప్రస్తుతం రూ.10 చేశారు. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. రోజుకు 1500 ప్లేట్ల చొప్పున నాలుగు పెద్ద కంటైనర్లలో 60 కిలలో బిర్యానీ అమ్ముతారంట. బేగం బజార్, ఉస్మానియా ఆస్పత్రికి వచ్చే రోగుల బంధువులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ధర తక్కువ కావడం జనం ఎగబడుతున్నారు. అయితే చాలా మంది రూ.10 బిర్యానీ అంటే రుచి బాగొదని సందేహ పడుతుంటారు. రుచిలో కూడ ఏమాత్రం తగ్గడం లేదు ఈ పది రూపాయల బిర్యానీ. ఇది రెస్టారెంట్లలో ఉన్నట్లే రుచికరంగా ఉంటుంది కానీ రూ.10కి ఇచ్చేది చికెన్ బిర్యానీ కాదు.
కేవలం వెజ్ బిర్యానీ మాత్రమే అమ్ముతారు. అయితే ఈ బిర్యానీలో క్యారెట్లు, గ్రీన్ పీస్, బంగాళ దుంపలు, బీన్స్ వంటివి అన్నీ వేసి ఘుమ ఘుమలాడిస్తుంటారు. ఇక్కడ ప్లేట్ రూ.10తోపాటూ… అరకేజీ బిర్యానీని రూ.30, కేజీ బిర్యానీని రూ.60 చొప్పున అమ్ముతున్నారు. ఈ బిర్యానీ అమ్మడంలో ఇప్తికార్ తో పాటు అతని అన్నదమ్ములు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ఇక్కడ నుంచి పార్శిర్లు కూడా కట్టించుకుని మరి తీసుకెళుతున్నారు. నాణ్యత లేని ఆహారం పెడుతూ.. అడ్డగోలు రేట్లు బాదేస్తూ.. దొచుకుంటున్న చాలా హోటళ్లు ఉన్న ఈ రోజుల్లో కేవలం రూ.10 రుచికరమైన బిర్యానీ అందిస్తున్నారని స్థానికులు మెచ్చుకుంటున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Madhya pradesh: బుల్డోజర్ పై ఊరేగింపులో వచ్చిన వరుడు.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు!