ప్రస్తుతం అందరూ వాట్సాప్ కి అలవాటు పడిపోయారు. వాట్సాప్ లేకపోతే పనులు అవ్వని పరిస్థితి. వాట్సాప్ అంటే జ్ఞాపకం మాత్రమే కాదు, అదొక జీవితం అయిపోయింది. అలాంటి వాట్సాప్ సేవలను కొన్ని ఫోన్లలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది మెటా. ఎప్పటికప్పుడు వాట్సాప్ ను అప్ డేట్ చేస్తూ.. కొత్త ఫీచర్లను తీసుకురావడం మెటా ఆనవాయితీ. బట్ ఫర్ ఏ ఛేంజ్.. కొన్ని ఫోన్లలో వాట్సాప్ నిలిపివేయాలని నిర్ణయించుకుంది. సాఫ్ట్ వేర్ అప్ డేట్, భద్రతాపరమైన లోపాల కారణంగా 49 స్మార్ట్ ఫోన్ మోడల్స్ లో వాట్సాప్ సేవలను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. వినియోగదారులు ఈ కొత్త మార్పును గమనించాలని మెటా కోరింది. జనవరి 1 నుంచి ఇక వాట్సాప్ పనిచేయదని తెలిపింది.
డిసెంబర్ 31 తర్వాత నుంచి వాట్సాప్ విడుదల చేసే కొత్త ఫీచర్లు, సెక్యూరిటీ అప్ డేట్ లు 49 ఫోన్లకి రావని ప్రకటించింది. వాట్సాప్ పేర్కొన్న 49 ఫోన్లలో ఎక్కువగా పాత మోడల్సే ఉన్నాయి. ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ, శాంసంగ్ గెలాక్సీ సిరీస్ కి చెందిన కోర్, ఎస్ 2, ఎస్ 3 మినీ, ట్రెండ్ 2, ట్రెండ్ లైట్, ఎక్స్ కవర్ 2, ఏస్ 2 మోడల్స్ లో వాట్సాప్ సేవలు నిలిపివేయడం జరుగుతుందని ప్రకటించింది. అలానే సోనీ ఎక్స్పీరియా ఆర్క్ ఎస్, ఎక్స్పీరియా మిరో, ఎక్స్పీరియా నియో ఎల్, ఆర్కోస్ 53 ప్లాటినమ్, గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్ జడ్ టీఈ, గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వీ 987 జడ్ టీఈ, వికో సింక్ ఫైవ్, వికో డార్క్ నైట్ జడ్ టి, హెచ్టీసీ డిజైర్ 500, లెనోవా ఏ 820, క్వాడ్ ఎక్స్ఎల్ వంటి మోడల్స్ లో డిసెంబర్ 31 తర్వాత వాట్సాప్ పని చేయదని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లను ఇప్పటికీ ఎవరైనా వాడుతుంటే గనుక వాట్సాప్ ను అన్ ఇన్స్టాల్ చేసుకోవడమో లేదా కొత్త ఫోన్ కొనుక్కోవడం తప్ప వేరే మార్గం లేదని తెలిపింది.