SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » What Is Pegasus Spyware How It Works And What It Collects

పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ అంటే ఏమిటి? దీనిని దేనికి ఉపయోగిస్తారు!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Mon - 21 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ అంటే ఏమిటి? దీనిని దేనికి ఉపయోగిస్తారు!

గతేడాది వెలుగు చూసిన పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ నుంచి కొనుగోలు చేసిన పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం.. చట్టవిరుద్ధంగా దేశంలోని రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల ఫోన్లపై నిఘా ఉంచిందనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిశోర్, కొందరు కేంద్ర మంత్రులతో పాటు దాదాపు నలభై మంది జర్నలిస్టుల ఫోన్లు లక్ష్యంగా చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పెగాసస్ మాల్వేర్ విషయం గురుంచి.. రోజుకో కొత్త కథనం బయటకొస్తూ, పాలకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఈ సమయంలో మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి.. అసలు పెగాసస్ అంటే ఏమిటి?, ఈ స్పైవేర్ ను ఎందుకు డెవలప్ చేశారు? పెగాసస్ స్పైవేర్ ఎలా పనిచేస్తుంది?. ఫోన్‌లో పెగసాస్ స్పైవేర్ ఎలా ఇన్‌స్టాల్ చేయబడుతుంది?. దీని నుంచి తప్పించుకోవడానికి మార్గాలున్నాయా..? ఇలాంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం.

పెగాసస్ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?Pegasusపెగాసస్ అనేది ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ అనే సంస్థ తయారు చేసిన ఒక స్పైవేర్ టూల్‌. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లు తయారు చేయడానికి ఆ సంస్థ పెట్టింది పేరు. వ్యక్తుల మీద నిఘా పెట్టడమే పెగాసస్ ముఖ్య ఉద్దేశం. దీనికోసం అది యూజర్లకు ఒక లింక్ పంపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే చాలు, ఆ యూజర్‌ ఫోన్‌ పూర్తిగా ఎటాకర్ అధీనంలోకి వెళ్లిపోతుంది. యూజర్‌కు తెలీకుండానే ఆ టూల్ అతడి ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఒకసారి ఇన్‌స్టాల్ అయ్యాక ఫోన్‌కు సంబంధించిన డేటానంతా ఎటాకర్‌కు పంపించడం మొదలుపెడుతుంది.

పెగాసస్ మీ ఫోన్‌లో మీరు చేసే అన్ని పనులను చేస్తుంది. మీ కెమెరాను ఓపెన్ చేయడం ద్వారా ఫోటోను క్లిక్ చేయవచ్చు. మెసేజెస్ పంపవచ్చు, క్యాలెండర్ చెక్ చేయవచ్చు. ఇ-మెయిల్ నుండి బ్యాంక్ యాప్స్ వరకు, మీరు పూర్తి సమాచారాన్ని తీసుకుంటుంది. అలాగే మైక్రోఫోన్‌ను హాయిగా యాక్సెస్ చేయగలదు. వాట్సాప్ అండ్ ఐమెసెంజర్ వంటి ఎన్ క్రిప్టెడ్ యాప్స్ నుండి చాట్‌లను కూడా చదవగలదు.

What Is Pegasus Spyware
Pegasus spyware is the name for the most powerful piece of spyware ever developed marketed and licensed to governments across countries by NSO Group, a private Israeli company. #Pegasus #spyware #malware #phishing #cyberattack #Hacker #malicious pic.twitter.com/M19mmK0GbY

— Cyethack Solutions (@cyethack) February 19, 2022

పెగాసస్ స్పైవేర్ ను ఎందుకు డెవలప్ చేశారు?Pegasusనిజానికి, తీవ్రవాదులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాదార్ల కోసం ఉద్దేశించిన నిఘా సాఫ్ట్‌ వేర్‌ అది. కానీ, ఇజ్రా యెల్‌ ఈ స్పైవేర్ ను సొంతానికి వాడుకుందన్నది ఆరోపణ.

ఇజ్రాయెల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే. 2017 జూలై నాటి.. ఆ పర్యటనలో భారత్, ఇజ్రాయెల్‌ల మధ్య కుదిరిన 200 కోట్ల డాలర్ల మేర ‘అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల’ ఒప్పందంలో ఈ ‘పెగసస్‌’ నిఘా సాఫ్ట్‌వేర్‌ ని కొనుగోలు చేశారని.. అప్పట్లో ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ఓక కథనాన్ని వెల్లడించింది.

పెగసాస్ స్పైవేర్ ఒకరి ఫోన్‌కు ఎలా చేరుతుంది?

ఒకప్పుడు ఫోన్‌ వాడేవారిని ఆకర్షించి, వారు క్లిక్‌ చేసే మోసకారి లింకుల రూపంలో జొరబడేవారు. ఇప్పుడూ లింకులు నొక్కడం లాంటివేవీ అవసరం లేకుండానే లక్షిత వ్యక్తిపై నిఘా పెట్టడం, కంప్యూటర్‌లలో కొత్త లెటర్లు జొప్పించడం కొత్త పెగసస్‌ పద్ధతి. పెగాసస్ ని ఏదైనా ఫోన్‌లోనైనా లేదా మరే ఇతర డివైజెస్ లో రిమోట్‌గా ఇన్‌స్టాల్ చేయవచ్చు. మిస్డ్ కాల్ చేయడం ద్వారా లేదా మీ ఫోన్‌కు వాట్సాప్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్, సోషల్ మీడియా ద్వారా కూడా చేరవచ్చు.

#MyUpscClass #upsc #IAS
What is Pegasus spyware?

Firstly understand what is Spyware?

Spyware is some sort of malicious software that is usually installed in your computer or mobile device, even without your consent, to damage your system or stealhttps://t.co/99laJog1Vh pic.twitter.com/EEd0W7Jf5A

— MY UPSC CLASS (@MyUpscClass) February 2, 2022

పెగాసస్ ద్వారా మీ ఫోన్ ట్రాక్ అవుతుందో లేదో ఎలా తెలుసుకోవాలి?Pegasusమీ ఫోన్‌లో ఏదైనా వింతగా జరుగుతుంటే మీరు అప్రమత్తంగా ఉండాలి. మీ ఫోన్ ని పర్యవేక్షించడం ద్వారా కూడా ఈ వైరస్ ని కనుగొనవచ్చు, అయినప్పటికీ మీరు ఏం చేయలేరు. ఎందుకంటే ఇందుకోసం మీరు ల్యాబ్ సహాయం తీసుకోవాలి. ప్రాసెస్ మానిటరింగ్‌తో మీ ఫోన్‌లో ఎంత ట్రాఫిక్ ఉందో ఇంకా డేటా ఎక్కడ బదిలీ అవుతుందో తెలుసుకోవచ్చు. ఫోన్‌లో పెగసాస్ ఉనికి గురించి సమాచారం ప్రాసెస్ మానిటరింగ్ లేదా ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, ఎందుకంటే ఈ సాఫ్ట్‌వేర్ రహస్యాన్ని చేరవేయడానికి డెవలప్ చేసిన ఒక వైరస్.. అంత సులభంగా గుర్తించలేం.

యూజర్‌కు ఏమాత్రం తెలీకుండా అతడి ఫోన్‌ను పెగాసస్ అధీనంలోకి తీసుకుంటుంది. ఏమాత్రం అనుమానం రాకుండా చాలా తక్కువ డేటాను, మెమరీని, బ్యాటరీని ఈ టూల్ ఉపయోగిస్తుంది. రిస్కీ సందర్భాల్లో సెల్ఫ్‌ డిస్ట్రక్షన్.. అంటే తనంతట తానుగా నాశనమయ్యే సాంకేతికత కూడా ఈ టూల్‌కు ఉంటుంది. ఆఖరికి అది ఏ అప్లికేషన్ ద్వారా ఫోన్‌లోకి వస్తుందో, ఆ యాప్ తయారీదారుకు కూడా దాని గురించి తెలిసే అవకాశం ఉండదు.

How Pegasus Spyware Works- pic.twitter.com/GbE4RBUTvJ

— Rohan (@rohanreplies) July 19, 2021

పెగసాస్ నుండి తప్పించుకోవడానికి మార్గాలున్నాయా..?

దీని నుంచి తప్పించుకోవడానికి, నివారించడానికి మార్గం లేదు. అవకాశం ఉన్నదల్లా.. డివైజ్ ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవడమే. అప్ డేట్ వచ్చినప్పుడల్లా ఫోన్‌ను అప్ డేట్ చేయండి, సెక్యూరిటి ప్యాచ్‌ను కూడా అప్ డేట్ చేయండి, తెలియని నంబర్ల నుండి లింక్‌లు, మెసేజులు మొదలైనవి ఓపెన్ చేయవద్దు, రిప్లయి కూడా ఇవ్వవద్దు, విదేశీ నంబర్‌ల నుండి కాల్స్ స్వీకరించవద్దు, సోషల్ మీడియాలో అనుమానాస్పద మెసేజుల నుండి దూరంగా ఉండండి.

Tags :

  • israel
  • Latest Tech News
  • narendra modi
  • Pegasus
  • Pegasus Spyware
  • Rahul gandhi
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మణిపూర్ నిందితులకు ఉరిశిక్ష?.. రగిలిపోతున్న యావత్ దేశం

మణిపూర్ నిందితులకు ఉరిశిక్ష?.. రగిలిపోతున్న యావత్ దేశం

  • అద్భుతం చేసిన డాక్టర్లు.. తెగిన తలను తిరిగి అతికించారు!

    అద్భుతం చేసిన డాక్టర్లు.. తెగిన తలను తిరిగి అతికించారు!

  • రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టులో ఊరట!

    రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టులో ఊరట!

  • Drone Fly Over PM’s House: బ్రేకింగ్: ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్ కలకలం..

    Drone Fly Over PM’s House: బ్రేకింగ్: ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్ కలకలం..

  • కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న వంట నూనెల ధరలు

    కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న వంట నూనెల ధరలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam