అందరూ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే రోజుకో ఎన్నో స్మార్ట్ ఫోన్ మోడల్ మార్కెట్ లో విడుదల అవుతోంది. అయితే బడ్జెట్ ఫోన్లు మాత్రం చాలా తక్కువ రిలీజ్ అవుతున్నాయని చెప్పాలి. ఇప్పుడు శాంసంగ్ నుంచి ఒక బడ్జెట్ 5జీ ఫోన్ రిలీజ్ అయ్యింది.
ఇప్పుడు అందరూ కొత్త ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్ కొనాడానికే ఓటేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు అంత తక్కువ ధర ఏమీ ఉండవు. అయితే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో మళ్లీ 5జీ ఫోన్ అంటున్నారు. 5జీలో స్మార్ట్ ఫోన్ కొనాలి అంటే కచ్చితంగా రూ.15 వేలు వరకు ఖర్చు చేయాలి మరి. కానీ, శాంసంగ్ కంపెనీ ఒక సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ని భారత్ మార్కెట్ లో విడుదల చేసింది. అదికూడా బడ్జెట్ ధరలోనే. మధ్యతరగతి వాళ్లు కూడా 5జీ స్మార్ట్ ఫోన్ కొనుక్కునే రేంజ్ లో శాంసంగ్ న్యూమోడల్ ఉండటం విశేషం. రూ.13 వేల కంటే తక్కువ ధరకే మీరు ఈ స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ ఫోన్లో ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ కూడా ఉన్నాయి.
శాంసంగ్ కంపెనీకి స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇప్పటికే శాంసంగ్ నుంచి ఎన్నో స్మార్ట్ ఫోన్ మోడల్స్ ఉన్నాయి. తాజాగా 5జీ మోడల్స్ ని కూడా లాంఛ్ చేసింది. అయితే ఇప్పుడు మధ్యతరగతి మార్కెట్ ని టార్గెట్ చేస్తూ శాంసంగా F14 5జీ స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేసింది. భారత మార్కెట్ లో లాంఛ్ అయిన ఫోన్ ఫ్లిప్ కార్ట్, శాంసంగ్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. త్వరలోనే ప్రముఖ రిటైల్ స్టోర్స్ కి ఈ మోడల్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. బడ్జెట్ ఫోన్ ని లాంఛ్ చేయడమే కాకుండా ఎక్స్ క్లూజివ్ ఆఫర్స్ ని కూడా ఇస్తోంది.
ఈ శాంసంగ్ F14 5జీ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉంది. సెగ్మెంట్ ఓన్లీ 5ఎన్ఎం ప్రాసెసర్ మీద పని చేస్తుంది. దీనివల్ల మల్టీ టాస్కింగ్, గేమింగ్ కి కూడా ఈ ఫోన్ యూజ్ అవుతుంది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. సింగిల్ ఛార్జ్ తో రెండ్రోజుల వరకు ఫోన్ యూజ్ చేయచ్చని చెబుతున్నారు. 13 బాండ్స్ 5జీ కనెక్టివిటీతో ఈ ఫోన్ వస్తోంది. 2 సార్లు ఓఎస్, 4సార్లు సెక్యూరిటీ అప్ డేట్స్ ని ప్రామిస్ చేస్తున్నారు. 50 ఎంపీ రేర్ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. దీని ధర విషయానికి వస్తే.. రూ.14,490కి అందిస్తున్నారు. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కార్డ్స్ కలిగిన వాళ్లు ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.1500 డిస్కౌంట్ పొందవచ్చు.
Samsung Galaxy F14 5G Indian pricing has been revealed. Starts at an introductory pricing of ₹12,990.#Samsung #GalaxyF14 #Frevolution5G pic.twitter.com/eJBCbiKthu
— Mukul Sharma (@stufflistings) March 24, 2023