చాలా మంది ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లతో నరకం అనుభవిస్తుంటారు. కొన్న కొత్తలో బాగానే పని చేస్తుంది. కానీ మన చేతుల్లోకి వచ్చిన కొన్ని రోజులకి దానికి పోయే కాలం వస్తుంది. పవర్ ఆన్ చేసిన వెంటనే రాదు. ఎవరో వెనక నుంచి ఆపుతున్నట్టు గ్యాప్ తీసుకుని కొంత సమయం తర్వాత వస్తుంది. ఈలోపు మనకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ల్యాప్ టాప్ ని విసిరి కొట్టాలనిపిస్తుంది. మన ఈగో హర్ట్ చేసిందన్న కోపంతో ముక్కలు ముక్కలుగా చేయాలనిపిస్తుంది. ఈ సమస్య సగటు ల్యాప్ టాప్ యూజర్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. స్లో అయిన ప్రతిసారీ కొత్త ల్యాప్ టాప్ కొనాలంటే మన లాంటి మిడిల్ క్లాస్ యూత్ కి ఎక్కడ సాధ్యపడుతుంది? చాలా నెమ్మదిగా ఉంటుంది.
ర్యామ్ స్పీడ్, ప్రాసెసర్ అన్నీ బాగానే ఉన్నా గానీ ఎందుకో తెలియదు గానీ బాగా నెమ్మదిగా ఉంటుంది. కొంచెం హెవీ అప్లికేషన్ వాడితే మధ్యలో హ్యాంగ్ అయిపోతుంది. ఎక్కువగా విండోస్ ల్యాప్ టాప్ లలో ఈ సమస్య చూస్తుంటాం. మరి ఈ సమస్య నుంచి బయటపడే మార్గమే లేదా అంటే ఖచ్చితంగా ఉంది అనే చెప్పాలి. కొత్త ల్యాప్ టాప్ లే కాదు, పాత ల్యాప్ టాప్ ని సైతం స్పీడప్ చేసే సాఫ్ట్ వేర్ ని సిద్ధం చేసింది మైక్రోసాఫ్ట్ కంపెనీ. చాలా మంది ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు వాడుతుంటారు. కానీ డివైజ్ పెర్ఫార్మెన్స్ ని పెంచడం అనేది తెలియదు. ల్యాప్ టాప్ లేదా మీ డెస్క్ టాప్ తో విసిగిపోయి ఉన్నారా? మీ ల్యాప్ టాప్ లేదా సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ ని పెంచాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ యాప్.
గూగుల్ లో మైక్రోసాఫ్ట్ పీసీ మేనేజర్ లింక్ పై క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఉచితమే. దీనిపై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయ్యాక హెల్త్ అండ్ అదర్ స్టాట్స్ ఆఫ్ కంప్యూటర్ అనే పాపప్ కనిపిస్తుంది. బూస్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీ డివైజ్ లో ఉన్న టెంపరరీ ఫైల్స్ తో సహా ఉపయోగం లేని ఫైల్స్ ని డిలీట్ చేసేస్తుంది.
కంటికి కనిపించని ఉపయోగం లేని ఫైల్స్ ని సైతం ఇది డిలీట్ చేస్తుంది. దీని వల్ల మీ కంప్యూటర్/ల్యాప్ టాప్ మెరుగ్గా పని చేస్తుంది. ఈ యాప్ తో మీ డెస్క్ టాప్, ల్యాప్ టాప్ పెర్ఫార్మెన్స్ ని పెంచుకోవచ్చు. ఇది మీ డివైజ్ యొక్క పెర్ఫార్మెన్స్ ని బోస్ బూస్ట్ చేస్తుంది. రెగ్యులర్ గా ల్యాప్ టాప్, డెస్క్ టాప్ హెల్త్ ని చెక్ చేస్తుంది. మరియు యాంటీ వైరస్ లా పని చేస్తుంది. అయితే ఇది కేవలం విండోస్ 10, విండోస్ 11 యూజర్స్ కి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ విండోస్ 7, విండోస్ 8 సర్వీస్ లని ఆపేసింది. కేవలం విండోస్ 10, 11 ఆపరేటింగ్ సిస్టంలకి మాత్రమే ఈ యాప్ ని డెవలప్ చేసింది.