విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్ గా తొలగించినప్పటి నుంచి బీసీసీఐ మీద అభిమానులు దండయాత్ర చేస్తున్నారు. రోజుకో కొత్త విమర్శ, ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. కోహ్లీపై కుట్ర జరిగిందని కొందరు అంటుంటే.. మరికొందరు టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తొలగిస్తారంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంపై విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ స్పందించాడు. కోహ్లీ కెప్టెన్సీ తొలగింపుపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
A leader who led the side with grit, passion & determination. 🇮🇳🔝
Thank you Captain @imVkohli!👏👏#TeamIndia pic.twitter.com/gz7r6KCuWF
— BCCI (@BCCI) December 9, 2021
‘కెప్టెన్సీ తొలగింపు ప్రకటన తర్వాతి నుంచి నేను ఇప్పటివరకు కోహ్లీతో మాట్లాడలేదు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. కెప్టెన్సీ తొలగింపునకు సంబంధించిన కారణాలను సెలక్షన్ కమిటీ ప్రస్తావించలేదు. యాజమాన్యం, బీసీసీఐ, సెలక్షన్ కమిటీ నిర్ణయంలో పారదర్శకత కనింపించలేదు. కోహ్లీ సక్సెస్ ఫుల్ వన్డే కెప్టెన్. అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించడం విచారకరం’ అంటూ రాజ్ కుమార్ శర్మ వాపోయాడు.
Leader. Warrior. Inspiration.
There’s only one King Kohli. 👑 @imVkohli#PlayBold #TeamIndia #WeAreChallengers pic.twitter.com/lQFEFlffQ4
— Royal Challengers Bangalore (@RCBTweets) December 9, 2021
గంగూలీ వ్యాఖ్యలపై కూడా రాజ్ కుమార్ ప్రస్తావించాడు. ‘కోహ్లీని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోరినట్లు గంగూలీ వ్యఖ్యానించినట్లు నేను చదివాను. ఆ వార్తలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. నాకు తెలిసి గంగూలీ.. విరాట్ కోహ్లీని అలా అడగలేదు. అదే విషయంపై పలు రకాల వ్యాఖ్యలు ప్రచారంలో ఉన్నాయి’ అంటూ రాజ్ కుమార్ శర్మ అభిప్రాయపడ్డాడు. రాజ్‌కుమార్ శర్మ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Dear Virat Kohli, Thanks For Your Existence…@imVkohli pic.twitter.com/rqGgo7QjG7
— Extrovert™ (@Thala_Virat18) December 10, 2021