పది దేశాలకే పరిమితమైన క్రికెట్ ప్రపంచంలోకి అసోసియేట్ దేశాలు ఇప్పుడిప్పుడే బుడి బుడి అడుగులు వేస్తున్న రోజులివి. యూఏఈ, నమీబియా, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, కువైట్, పాపువా న్యూ గినియా.. ఈ జట్లన్నీ అలాంటివే. ఈ పేర్లు ఐసీసీ ఈవెంట్లలో తప్ప మరెక్కడా కనిపించవు. అందుకు సవా లక్ష కారణాలు. ఆయా జట్లకు ఆడుతున్న ఆటగాళ్లలో కొందరు దేశంపై ప్రేమతో ఆడుతుంటే.. మరికొందరు పొట్ట నింపుకోవడానికి ఆడుతున్నారు. ఇండియా- నెదర్లాండ్స్ మ్యాచులో కేఎల్ రాహుల్ వికెట్ తీసిన నెదర్లాండ్స్ బౌలర్ ‘పాల్ వాన్ మీకెరెన్’ అలాంటి పరిస్థితులనే ఎదుర్కున్నాడు. కరోనా మహమ్మారి తన జీవితాన్ని ఎలా తలకిందులు చేసిందో పూసగుచ్చిన్నట్లు చెప్పుకొచ్చాడు.
దేశానికి ఆడాలని కలలు కానివారికి డబ్బుపై ఆశ ఉండకపోవచ్చు. కానీ, ఒక్కసారి ఆ అవకాశం వస్తే డబ్బులు వాటంతట అవే వస్తాయని వారికి ముందే తెలుసు. ఇక్కడ ఓ తిరకాసు ఉంది. క్రికెట్ ను విపరీతంగా ఆదరించే టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి దేశాలకు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లకు డబ్బుకు డోకా ఉండకపోవచ్చు. అంతర్జాతీయ టోర్నీలలో అవకాశాలు రాకపోయినా దేశవాలీ టోర్నీలు వారి ఆకలి బాధలు తీర్చడంతో పాటు ఆర్థికంగా సంపాదన కూడా బాగానే ఉంటుంది. కానీ, అసోసియేట్ దేశాలకు ఆడే ఆటగాళ్లకు ఈమాత్రం కూడా అందవు. ఆడితే ఐసీసీ ఈవెంట్లలో ఆడాలి.. లేదంటే క్లబ్ మ్యాచులు ఆదుకోవాలి. వచ్చేదే అంతంత. కుటుంభాన్ని నెట్టుకొస్తే చాలనేది వారి ఆలోచన. మీకెరెన్ కూడా ఇలానే ఏదో విధంగా తన కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. అయితే.. కరోనా మహమ్మారి తన జీవితాన్ని తలకిందులు చేసింది.
Dishing the dirt on the #Netherlands team!
Paul van Meekeren reveals all about the characters in the Netherlands #T20WorldCup squad. pic.twitter.com/ysowRdzx0S
— ICC (@ICC) October 22, 2021
2013లో నెదర్లాండ్స్ తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన పాల్ మీకెరెన్, మేటి క్రికెటర్ గా రాణించాలని ఎన్నో కలలు కన్నాడు. మొదట్లో వచ్చిన అవకాశాలు అంతంత మాత్రమే. తాను నిరూపించుకోవడానికే నాలుగైదేళ్లు పట్టింది. అలా నిలదొక్కుకునే సమయంలో కరోనా అతని జీవితాన్ని అతలాకుతలం చేసింది. కరోనా దెబ్బకు మ్యాచులు లేకపోవడంతో పాల్ కుటుంబం రోడ్డున పడింది. ఒకపూట తిండి తినడానికి కష్టంగా మారడంతో క్రికెట్ ను వదిలి ఆటో డ్రైవర్ గా మారాడు. అంతేకాదు.. ఉబెర్ ఈట్స్ ఫుడ్ డెలివరీ డ్రైవర్ గా కూడా ఉద్యోగం చేశాడు. ఆపై కరోనా తగ్గుముఖం పట్టడంతో తనకు ఇష్టం లేని పనిని వదిలేసి తనకిష్టమైన కౌంటీ క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. అలా కౌంటీ క్రికెట్ లో మెరిసిన మీకెరెన్ తనను తాను నిరూపించుకున్నాడు. ఆపై కరీబియన్
ప్రీమియర్ లీగ్ లోనూ ఆడాడు.
Australia calling 📞
Netherlands have booked their spot in the ICC Men’s #T20WorldCup 2022 🤩 pic.twitter.com/lPJLQhrOCe
— ICC (@ICC) July 15, 2022
ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ లో ఆడటానికి నెదర్లాండ్స్ అర్హత సాధించడంతో జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వెళ్ళాడు. జట్టు సూపర్-12 చేరడంలో కీలకపాత్ర పోషించాడు. క్వాలిఫయింగ్ మ్యాచ్ ఐదు మ్యాచ్ ల్లో ఆరు వికెట్లు తీసి జట్టుకు తనవంతు సాయం చేసాడు. జట్టు సూపర్-12కు అర్హత సాధించింది. వారిలో పట్టరాని సంతోషం. ముందుంది బలమైన జట్లయినా వారిలో పోరాటపటిమలో ఎక్కడ తగ్గలేదు. భారత్ తో జరిగిన మ్యాచ్ అందుకు చక్కటి ఉదాహరణ. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు మంచి ఆరంభం లభించలేదు. 9 పరుగులకే రాహుల్ వెనుదిరిగాడు. సారధి రోహిత్ శర్మ మొదట్లో బౌండరీలు సాధించడానికి నానా కష్టాలు పడ్డాడు. అదృష్టవశాత్తూ మీకెరెన్ కు ఈ మ్యాచులో ఆడే అవకాశం లభించింది. మ్యాచ్ ఓడిపోయినప్పటికి కేఎల్ రాహుల్ వికెట్ తీసి ఆనందంలో మునిగిపోయాడు. ఈ తరుణంలో తన జీవిత ప్రయాణాన్ని, ఇండియా లాంటి దేశంపై క్రికెట్ ఆడడాన్ని తన జీవితంలో మరిచిపోలేని అనుభుతిగా మీకెరెన్ చెప్పుకొచ్చాడు.
Can we now classify @paulvanmeekeren as an all-rounder? 😂
Another key performance for van Meekeren with 5 tournament wickets + an overall economy rate of 5.31!
Paul also joins Pieter Seelaar as the Dutch’s highest wicket-taker in International T20 cricket.#t20worldcup pic.twitter.com/umqBTKwbXY
— Netherlands Cricket Insider (@KNCBInsider) October 25, 2022