‘లివింగ్ స్టోన్‘.. పేరుకు ఇంగ్లాండ్ క్రికెటర్ అయినా.. భారీ సిక్సులు కొట్టడంలో వెస్టిండీస్ క్రికెటర్లను మించిపోయాడు. ఆ కొట్టడం చూస్తుంటే.. 12 పరుగుల ఇస్తారా! అలా సిక్స్ కొడితే అన్నట్లుగా బాదుతున్నాడు. సిక్స్ కొట్టినప్పుడల్లా బాల్ స్టేడియం బయటకు వెళ్తుండడంతో.. కొత్త బంతి ఇవ్వలేక అంపైర్లకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన లివింగ్ స్టోన్.. రెండు, మూడు మ్యాచుల్లో మాత్రమే రాణించినా.. ఇంగ్లాండ్ కౌంటీలో మాత్రం తనదైన శైలిలో విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలో.. లాంగ్షైర్ జట్టు తరఫున ఆడుతున్న లివింగ్ స్టోన్ యార్క్ షైర్తో జరిగిన మ్యాచ్‌లో బాల్ ను కంటికి కనపడనంత దూరం బాదాడు.
6 అడుగుల ఎత్తు, చూడడానికి బక్కపీచులా కనబడే లివింగ్ స్టోన్.. కౌంటీ బౌలర్ల పాలిట పీడకలగా మారుతున్నాడు. అంతో.. ఇంతో.. నేర్చుకొని కౌంటీ మ్యాచుల్లో రాణిస్తున్న యువ క్రికెటర్లకు ఓవర్ కు 20 పైగా పరుగులు బాదుతూ.. మరో మ్యాచులో అవకాశం దక్కకుండా చేస్తున్నాడు. తాజగా.. యార్క్ షైర్ తో జరిగిన మ్యాచులో.. లివింగ్ స్టోన్ బాల్ ను కంటికి కనపడనంత దూరం బాదాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఇలా.. ‘ఇష్టం వచ్చినట్లు కొడితే.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్.. మ్యాచ్ ఫీజులో కోత పెడతది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
That. Is. Huge.
🔥 @liaml4893 🔥#Blast22 #RosesT20 pic.twitter.com/FAAaWKg85P
— Vitality Blast (@VitalityBlast) May 27, 2022
ఇది కూడా చదవండి: Mahela Jayawardene: ‘నా దృష్టిలో అతనే గొప్ప బౌలర్’..ముంబై హెడ్ కోచ్ షాకింగ్ కామెంట్స్!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన లాంగ్షైర్ నిర్ణీత 20 ఓవర్లలో183 పరుగులు చేయగా.. అనంతరం బ్యాటింగ్ చేసిన యార్క్ షైర్ సైతం.. 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. పరుగులు సమం అవ్వడం, సూపర్ ఓవర్ రూల్స్ లేకపోవడంతో.. మ్యాచ్ టైగా ముగిసింది. ఇక.. ఐపీఎల్ 2022 సీజన్లో లివింగ్ స్టోన్.. 14 మ్యాచ్‌లు 437 పరుగులు చేశాడు. సగటు 36.42గా నమోదవ్వగా స్ట్రైక్‌రేట్ 182.08గా నమోదైంది.