జూనియర్ గంగూలీగా ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొడుతున్న వెంకటేష్ అయ్యార్ పై ప్రశంసలు కురిపించారు క్రికెట్ లెజెండ్ సునీల్ గవస్కర్. తన అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్నాడని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీల్ గవస్కర్ ఈ కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడిపై ఇలా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్-2021 రెండవ దశలో అద్భుతమైన ఆటతీరుతో తన ప్రతిభను కనబరుస్తున్నాన్నాడని సునీల్ గవస్కర్ అన్నారు.
ఇక హార్ధిక పాండ్యా లాంటి బలమైన ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్ లోనూ విఫలమవుతున్నారని దీని కారణంగా వెంకటేష్ అయ్యార్ లాంటి ఆటగాళ్లపై దృష్టి వెళ్లొచ్చని తెలిపారు. ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 126 పరుగులు, 2 వికెట్లు సాధించిన వెంకటేశ్ అయ్యర్ ఓ గొప్ప ఆటగాడుగా రాటుదేలుతున్నాడని గవస్కర్ తెలిపాడు. దీంతో పాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు బ్యాంటింగ్ లనూ ఇటు బౌలింగ్ లోనూ బాగా ఆడుతున్నా వెంకటేష్ అయ్యార్ లాంటి ఆటగాళ్ల కోసమే టీంమిండియా ఎదురుచూస్తోందని తన మనసులోని అభిప్రాయాలను తెలిపాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడైన వెంకటేష్ అయ్యార్ పై సునీల్ గవస్కర్ చేసిన వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.