Sourav Ganguly : పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే.. ఈ మధ్య ఎక్కడ చూసినా తరచుగా వినిపిస్తున్న పదాలు.. సుకుమార్ డైరెక్షన్. అల్లు అర్జున్ యాక్షన్ సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఎంతలా అంటే పిల్లలు,పెద్దలు తేడా లేకుండా ఆ సినిమాలోని ‘‘శ్రీవల్లి’’ పాటను’’ తగ్గేదేలే’’ డైలాగ్‌ను ఇష్టం వచ్చినట్లు వాడేంతగా. పుష్ప ఫీవర్ అంతటితో ఆగలేదు. సెలెబ్రిటీలకు కూడా పట్టుకుంది. చాలా మంది ఆ పాటకు డ్యాన్స్ వేయటమో.. డైలాగ్ చెప్పటమో చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా, ఈ పుష్ప ఫీవర్ టీమిండియా మాజీ ఆటగాడు, బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలిని తాకింది. ఆయన జీ బంగ్లా ఛానల్‌లో ‘‘దాదాగిరి అన్‌లిమిటెడ్’’ అనే చిన్నపిల్లల షో చేస్తున్నాడు. తాజాగా ఓ పిల్లాడు షోలో పాల్గొన్నాడు.
స్టైలిష్ కంటి అద్దాలు పెట్టుకున్న అతడ్ని గంగూలి.. ‘‘ కంటి అద్దాలు ఎందుకు పెట్టుకున్నావు’’ అని అడుగుతాడు. అందుకు ఆ పిల్లాడు ‘‘ పుష్పకు కంటి అద్దాలు ఉండాలి’’ అని అంటాడు. ఆ తర్వాత బుడ్డోడు, గంగూలి మరో పాప ‘‘శ్రీవల్లి’’ పాటకు డ్యాన్స్ వేస్తారు. కొద్దిసేపటి తర్వాత గంగూలి బొమ్మ, బొరుసు వేయటానికి ఓ కాయిన్‌ను గాల్లోకి వేస్తాడు. అది కిందపడుతుంది. కిందపడ్డ కాయిన్‌ను పైకి తీయమంటాడు గంగూలి.. అందుకు ఆ కుర్రాడు.. ‘‘పుష్ప.. తగ్గేదేలే’’ అని అంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: తృటిలో ప్రాణాలతో బయటపడ్డ బాలుడు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.