పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తన కెరీర్ తాను అనుకున్న విధంగా కొనసాగి ఉంటే.. ఇప్పుడు అతనో గ్రేటెస్ట్ క్రికెటర్‌గా ఉండేవాడని పేర్కొన్నాడు. పాకిస్థాన్ తరఫున అనేక మ్యాచ్‌లు ఆడిన అక్తర్.. వందల సంఖ్యలో వికెట్లు పడగొట్టాడు. తన విచిత్రమైన బౌలింగ్ యాక్షన్‌తో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్తర్.. తన బౌలింగ్ స్పీడ్‌తో చాలా మంది బ్యాటర్లను భయపెట్టేవాడు. కానీ.. అక్తర్ ప్రస్తుతానికి పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌గా మాత్రమే మిగిలిపోయాడు. ఆ దేశపు మాజీ క్రికెటర్లు వకార్ యూనిస్, వసీం అక్రమ్‌లకు వచ్చిన ఖ్యాతి అక్తర్‌కు రాలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. తాను ఫిటెస్ట్ ప్లేయర్‌గా ఉండి ఉంటే.. ఈ రోజు గ్రేటెస్ట్ ప్లేయర్‌గా కీర్తించబడే వాడిని అంటూ పేర్కొన్నాడు.
1997లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అక్తర్.. 2011లో చివరి మ్యాచ్ ఆడాడు. ఈ తక్కువ టైమ్‌లో కూడా ఆడాల్సినన్ని మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. తరచు గాయాలపాలై జట్టుకు దూరం అయ్యేవాడు. సాధారణంగా ఫాస్ట్ బౌలర్లు తరచు గాయాలపాలవుతుంటారు. అందులోనూ అక్తర్ తన బౌలింగ్ యాక్షన్ వల్ల మరింత ఎక్కువగా గాయపడేవాడు. అక్తర్ బౌలింగ్ యాక్షన్ వల్ల అతని శరీర బరువు మొత్తం అతని వెన్నుముకపై, అలాగే మోకాళ్లపై ఎక్కువ పడేది. దీంతో అక్తర్ తరచు వెన్ను గాయంతో బాధపడేవాడు. ఆట నుంచి రిటైర్ అయినా కూడా అక్తర్‌ను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి.
తాజాగా తన మోకాళ్లకు అక్తర్ శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఒక ఫాస్ట్ బౌలర్ ఆటలో ఎలా తన ఎముకలను కరిగించుకుంటాడో చెబుతూ ఒక వీడియో కూడా చేశాడు. అయితే.. అక్తర్ ఆట పరంగా ఎంత మంచి బౌలరో.. ఆటలో అంత కంటే ఎక్కువ చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. బ్యాటర్లను ఏదో ఒకటి అనడం, మ్యాచ్‌కు ముందు ప్రగల్భాలు పలకడంతో అక్తర్ ఒక వివాదాస్పద క్రికెటర్‌గా పిలవబడే వాడు. అక్తర్ తన కెరీర్‌లో మొత్తం 46 టెస్టులు ఆడి 178 వికెట్లు పడగొట్టాడు. అందులో 10 వికెట్ల హల్ రెండు సార్లు, 5 వికెట్ల హల్ 12 సార్లు సాధించాడు. అలాగే 163 వన్డేలు ఆడి 247 వికెట్లు తీసుకున్నాడు. అందులో 4 సార్లు ఐదు వికెట్ల ఫీట్ సాధించాడు. ఒక టీ20ల్లో 15 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు సైతం కూల్చాడు. ఐపీఎల్‌లోనూ అక్తర్ ఆడాడు. ఆరంభం సీజన్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ తరఫున అక్తర్ బరిలోకి దిగాడు.
Agree with @shoaib100mph ?🤔 pic.twitter.com/Zz0HRba60u
— CricTracker (@Cricketracker) November 29, 2022