ప్రస్తుతం ఈ డిజిటల్ యుగంలో ప్రముఖులు చేసే అతిచిన్న పొరపాటు కూడా భయంకరమైన ట్రోలింగ్‌కు గురవుతుంది. ప్రస్తుతం ఈ ట్రోలింగ్ చేసే వారికి పాక్ క్రికెటర్ మొహమ్మద్ ఆమిర్ చిక్కాడు. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ అకాల మరణం చెందిన విషయం విదితమే. మార్చి 4న థాయ్‌లాండ్‌లోని విల్లాలో తుది శ్వాస విడిచాడు. ఈ క్రమంలో లెజెండ్ మృతి పట్ల దిగ్భ్రాంతి చెందిన సహచర ఆటగాళ్లు, ఇతర క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. ఆమిర్ సైతం వార్న్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్విట్టర్లో పోస్టు పెట్టాడు.
అయితే, ఇందుకు సంబంధించి అతడు చేసిన ట్వీట్లో అన్వయ దోషం వల్ల పూర్తిగా అర్థమే మారిపోయింది. ‘‘అతడు క్రికెట్ లెజెండ్, గొప్ప వ్యక్తి అనడం విని షాకయ్యాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలి లెజెండ్’’ అంటూ ఆమిర్ ట్వీట్ చేశాడు. ఒక్క ఫుల్స్టాప్ పెట్టి ఉంటే… ‘‘ఈ విషయం విని షాకయ్యాను. ఆయన లెజెండ్. గొప్ప వ్యక్తి ’’ అనే అర్థం వచ్చేది. కానీ ఆమిర్ ఒక్క డాట్ మిస్ కావడంతో నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ‘నీ ఇంగ్లిష్ వింటే వార్న్ ఏడ్చేసేవాడు. చచ్చిపోయి బతికిపోయాడు’ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో పాక్ ఆటగాళ్లు ఇలాగే వచ్చీ, రాని ఇంగ్లీష్‌తో ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
shocked to hear that he was legend of the game and equally a good person .
RIP LEGEND 🙏 😔 pic.twitter.com/bv9z0RojyT— Mohammad Amir (@iamamirofficial) March 4, 2022