వెస్టిండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతోనే కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రపంచ క్రికెట్లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌సింగ్ పేరిట ఉంది. మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో యువీ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. ఇప్పటి వరకు అదే ప్రపంచ రికార్డు. ఇప్పుడు తాజా సునీల్ నరైన్ ఆడిన తుపాన్ ఇన్నింగ్స్ తర్వాతి స్థానంలో ఉంటుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో భాగం బుధవారం చటోగ్రామ్ ఛాలెంజర్స్, కొమిల్లా విక్టోరియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నరైన్ తన విశ్వరూపం ప్రదర్శించాడు.
కొమిల్లా విక్టోరియన్స్ తరఫున్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన నరైన్ 16 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 57 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ తుపాన్ ఇన్నింగ్స్తోటి కొమిల్లా విక్టోరియన్స్ 12.5 ఓవర్లలోనే 149 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. చివరల్లో మొయిన్ అలీ హిట్టింగ్తో లక్ష్యఛేదన మరింత సులవైంది. కాగా నరైన్ ఐపీఎల్లో కోల్కత్తా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు. ఇప్పటికే నరైన్‌ను కేకేఆర్ రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. నరైన్ ఇన్నింగ్స్‌తో కేకేఆర్ మేనేజ్మెంట్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు సమాచారం. మరి నరైన్ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sunil Narine has just blasted a 13-ball fifty in the Bangladesh Premier League.
He finished his innings with a SR of 356.25.
Sensational hitting. #BPL2022 #BPL #SunilNarine pic.twitter.com/8DTR5HI1Ew— CricWorld (@CricWorld21) February 16, 2022