టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అజియో క్లాతింగ్ బ్రాండ్ యాడ్‌లో పాల్గొంది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించింది సారా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సారా.. అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటారు.
ఇక సహజంగానే అందంగా ఉండే సారా టెండూల్కర్.. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టడంపై సచిన్ అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నెటిజన్లు కూడా చాలా అందంగా, ప్రీటీగా, హాట్ లుక్‌లో అదరగొట్టిందని మెచ్చుకుంటున్నారు. మరి దిగ్గజ క్రికెటర్ కూతురు మోడలింగ్ రంగం ఎంచుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.