ధోని వారసుడిగా టీమిండయాలోకి వచ్చిన యంగ్ గన్ రిషభ్ పంత్ ధోని రికార్డులతో పాటు అతను సాధించలేని రికార్డులు కూడా సాధిస్తున్నాడు. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో టీమిండియా రెగ్యులర్ ప్లేయర్‌గా ఉన్న పంత్.. టెస్టు క్రికెట్లో అయితే తన డ్యాషింగ్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో పంత్ సత్తా చాటాడు. టీమిండియా దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనికి సైతం సాధ్యంకానీ రీతిలో టాప్ 10లో నిలిచాడు.
పంత్ ఖాతాలో 723 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో చేరిన మొదటి భారత వికెట్ కీపర్‌గా పంత్ రికార్డు సృష్టించాడు. గతంలో మహేంద్రసింగ్ ధోని కూడా ఎప్పుడూ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో చోటు సంపాదించలేదు. దీంతో ధోనిని అధిగమించి మరి పంత్ టాప్ 10లో చేరడం గమనార్హం.
పంత్ ఇటీవల సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. చివరి రెండు టెస్టు మ్యాచ్‌లో మంచి స్కోర్లు చేశాడు. సౌతాఫ్రికా వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో అజేయ సెంచరీ కొట్టిన పంత్.. ఇటీవల శ్రీలంకతో ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 96 రన్స్ చేశాడు. మొత్తంగా ఇప్పటివరకు 29 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన రిషబ్ పంత్ 40 సగటుతో 1831 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరి పంత్ బ్యాటింగ్‌పై, సాధిస్తున్న రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అవమానం ఎదురైన చోటే అభినందనలు అందుకున్న పంత్
Jadeja reaches the summit 👑
Kohli, Pant move up ⬆️Some big movements in the latest update to the @MRFWorldwide ICC Men’s Test Player rankings 📈
Details 👉 https://t.co/BjiD5Avxhk pic.twitter.com/U4dfnrmLmE
— ICC (@ICC) March 9, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.