ఫామ్‌లేమితో సతమతమవుతున్న టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో ఆదివారం మొదలైన మొదటి టెస్ట్‌లో గ్లోడెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ వైఫల్యంతో పుజారా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారీ వంటి ఆటగాళ్లు భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తుండటంతో పుజారా వైఫల్యం చర్చనీయాంశమైంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(123 బంతుల్లో 9 ఫోర్లతో 60) ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన పుజారా.. ఎదుర్కొన్న తొలి బంతికే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. లుంగి ఎన్గిడీ వేసిన ఇన్ స్వింగ్ డెలివరీని అంచనా వేయడంలో పుజారా విఫలమవ్వగా.. ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కైగన్ పీటర్సన్ ఏ తప్పు చేయకుండా ఆ బంతిని అందుకోవడంతో పుజారా పెవిలియన్ చేరాడు.
గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన పుజారాపై నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం మరేం పర్లేదన్నట్లు వెన్నుతట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఔటైన అనంతరం డ్రెస్ మార్చుకొని టీమిండియా డగౌట్‌లోకి వచ్చిన పుజారా.. జస్‌ప్రీత్ బుమ్రా, ప్రియాంక్ పాంచల్ పక్కన సైలెంట్‌గా నిలుచున్నాడు. వారికి దగ్గరగా వెళ్లిన కోచ్ ద్రావిడ్.. పుజారా వీపు తడుతూ పర్లేదన్నట్లు అతని ఎంకరేజ్ చేశాడు. దీంతో అప్పటివరకు ముభావంగా ఉన్న పుజారా చిరునవ్వులు చిందించాడు.
ఇక ద్రావిడ్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్లేయర్‌గా పుజారా విఫలమైనా.. కోచ్‌గా వారి ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా ద్రావిడ్ జాగ్రత్తపడుతున్నాడని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సెకండ్ ఇన్నింగ్స్ పుజారాకు అగ్ని పరీక్షలాంటిదనే చెప్పాలి. మరి పుజారా వైఫల్యంపై, ద్రావిడ్ ఎంకరేజ్‌మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: మరోసారి గ్లోడెన్ డక్ అయిన పుజారా! సెంచూరియన్ కలిసిరాట్లే..
#SAvIND pic.twitter.com/SpMO6RtccL
— Ashwin Natarajan (@ash_natarajan) December 26, 2021