క్రికెట్లో అద్భుతమైన ఫీల్డింగ్‌ను, క్యాచ్‌లను చూశాం వావ్ సూపర్ అంటూ మెచ్చుకున్నాం. మెరికల్లాంటి ఆటగాళ్లు గాల్లోకి దూకి బంతిని అందుకుంటే మైదానం మొత్తం చప్పట్లతో మార్మోగుతుంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక అద్భుతమైన క్యాచ్‌ను చూస్తే మాత్రం మెచ్చుకోవడంతో పాటు కొండంత స్ఫూర్తిని కూడా పొందుతాం. కర్ర సాయం లేకుండా అడుగుకూడా వేయలేని వ్యక్తి అమాంతం గాల్లోకి దూకి బంతిని అందుకుంటే.. చూసే వారు ఏవరైనా సరే మంత్రముగ్ధులు అవ్వకమానరు. అలాంటి ఒక అత్యద్భుతమైన క్యాచ్ ప్రస్తుతం అందరి ప్రశంసలను అందుకుంటుంది.
దివ్యాంగుల క్రికెట్ టోర్నీలో ఒక బౌలర్ కర్ర సాయంతో పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ చేసి.. బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి అమాంతం గాల్లోకి దూకి అందుకుంటాడు. ఈ క్రమంలో అతని చేతి కర్ర ఊడిపడుతుంది. అయినా కూడా బంతిని అందుకోని వావ్ అనిపించాడు. నిజానికి అతనికి ఒక కాలు లేదు. అద్భుతమైన డైవ్‌తో అతను క్యాచ్ పట్టిన విధానం క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మరి ఈ క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.