పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చుట్టు కొన్ని వివాదాలు అలుముకున్నట్లు తెలుస్తోంది. బాబర్ గర్ల్ ఫ్రెండ్ హమీదా ముక్తర్ తాజాగా సంచలన ఆరోపణలు చేసినట్లు వార్తలు ఊపందుకున్నాయి. అయితే గతంలో నేను బాబర్ ఆజమ్ కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుని ప్రేమించుకున్నామని తెలిపింది. డైలీ పాకిస్తాన్ కథనం ప్రకారం.. 2011లో బాబర్ నేను ఇంట్లో వాళ్లని కాదని పారిపోయామని, అప్పటి నుంచి కొన్ని రోజులు ఒకే దగ్గర ఉండేవాళ్లమని తెలిపింది.
అయితే కొంత కాలానికి బాబర్ నన్ను శారీరకంగా వాడుకోవటంతో ఇప్పుడు నేను గర్భవతినయ్యానని హమీదా అసలు విషయాలు బయటపెట్టింది. దీంతో పెళ్లి చేసుకుంటున్నానని నమ్మించటంతో ఇంట్లో నుంచి రూ.2 లక్షలు విలువైన నగలు కూడా దొంగిలించానంటూ హమీదా వివరించింది. దీంతో నేను పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పాటు కోర్టులో కేసు కూడా వేశానని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న బాబర్ కుటుంబ సభ్యులు నాకు రూ. 20 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునేందుకు కూడా చూశారంటూ హమీదా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ పై సంచలన ఆరోపణలను లేవనెత్తింది.