క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కేఎల్ రాహుల్– అతియా శెట్టిల వివాహం జరిగిపోయింది. జనవరి 23న కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ ప్రేమజంట మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. ఎప్పటి నుంచే వీరి పెళ్లి మీద వార్తలు వస్తుండగా తాజాగా వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం జరిగిన దగ్గరి నుంచి ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇటీవల అతియా శెట్టి ధరించిన లెహంగా గురించి ఓ వార్త వచ్చింది. ఆ డ్రెస్సును తయారు చేయడం కోసం 10 వేల గంటలు కష్టపడ్డారంట. అది కూడా కేవలం చేతితో మాత్రమే దానిని తయారు చేశారు. ఇప్పుడు వారి వివాహానికి సంబంధించి మరో క్రేజీ వార్త వైరల్ అవుతోంది.
సాధారణంగా ఏదైన ఫంక్షన్ ఉందంటే మిత్రులు, అతిథులు ఏదొక బహుమతి తీసుకొచ్చి ఇస్తుంటారు. అదే పెళ్లి అయితే ఆ గిఫ్టులు కాస్త ఖరీదైనవే అయి ఉంటాయి. అదే సెలబ్రిటీల వివాహం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా వీళ్లు ఒకరు క్రికెట్ లో హీరో అయితే మరొకరు బాలీవుడ్ సినిమాలో హీరోయిన్. మరి.. వీరి వివాహానికి ఏ రేంజ్ లో గిఫ్టులు వచ్చుంటాయి? ఆ ప్రశ్నకు సమాధానం మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నాం. వీరి వివాహానికి వేలు కాదు లక్షలు కోట్ల విలువైన బహుమతులు అందాయట. మరి వాటి విలువెంత? ఎవరెవరు బహూకరించారో చూద్దాం..
కేఎల్ రాహుల్- అతియాలకు సునీల్ శెట్టి ముంబైలో ఓ ఖరీదైన భవంతిని బహుమతిగా ఇచ్చాడంట. దాని విలువ అక్షరాలా రూ.50 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇంక అతియా శెట్టిక కండల వీరుడు సల్మాన్ ఖాన్ రూ.1.64 కోట్ల విలువైన ఆడీ కారును బహూకరించాడట. ఇంక అర్జున్ కపూర్ రూ.కోటిన్నర విలువైన వజ్రాలు పొదిగిన నగలను బహుమతిగా ఇచ్చాడంట. సునీల్ శెట్టి కో యాక్టర్ జాకీ ష్రాఫ్ రూ.30 లక్షళ విలువైన స్విస్ వాచ్ గిఫ్ట్ చేశాడం. ఇంక కేఎల్ రాహుల్ కి విరాట్ కోహ్లీ రూ.2.17 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారు, ధోనీ దాదాపు కోటి విలువచేసే స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్ చేశాడంటూ టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి ఈ నూతన వధూవరుల వివాహానికి ఇప్పటివరకు బహుమతుల రూపంలో దాదాపు రూ.65 కోట్ల విలువైన వస్తువులు అందినట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఏది నిజం? ఏది పుకారు చెప్పడానికి మాత్రం ఆస్కారం లేదు. ఎందుకంటే వారికి అందిన బహుమతులపై ఈ జంట స్పందిస్తుందని అనుకోవడం లేదు. అయితే వారి వివాహానికి ఆ స్థాయి బహుమతులు అందడం మరీ ఆశ్చర్యపోవాల్సిన అంశం మాత్రం కాదు. వీరు ఐపీఎల్ తర్వాత దాదాపు 3 వేల మంది అతిథులతో ఒక పెద్ద గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు.