శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో ఓ విచిత్ర కరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. న్యూజిలాండ్ ఫీల్డర్ విసిరిన త్రోకు లంక బ్యాటర్ అవుటయ్యాడు. అది క్లియర్ గా అవుట్ అని రిప్లేలో సైతం కనిపిస్తోంది. అయినా గానీ అంపైర్ దానిని అవుట్ గా ప్రకటించలేదు. ఎందుకంటే?
క్రికెట్ ఆటలో కొన్ని సంఘటనలు చూస్తే మనం షాక్ అవ్వక తప్పదు. కొన్ని సార్లు మనం నమ్మశక్యం కాని రీతిలో ఆ సంఘటనలు జరుతుంటాయి. తాజాగా శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో ఓ విచిత్ర కరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. న్యూజిలాండ్ ఫీల్డర్ విసిరిన త్రోకు లంక బ్యాటర్ అవుటయ్యాడు. అది క్లియర్ గా అవుట్ అని రిప్లేలో సైతం కనిపిస్తోంది. అయినా గానీ అంపైర్ దానిని అవుట్ గా ప్రకటించలేదు. ఎందుకంటే? ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.ఆ చిత్రమైన, ఆసక్తికరమైన సంఘటన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్-శ్రీలంక మధ్య తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కివీస్ 198 పరుగుల భారీ తేడాతో లంకను చిత్తు చేసింది. తొలుతు బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 274 పరుగులు చేయగా.. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక, కివీస్ పేసర్ల దాటికి 76 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ షిప్లీ 5 వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. దాంతో లంక వరల్డ్ కప్ ఆశలు క్లిష్టతరంగా మారాయి. ఇదంతా పక్కన పెడితే.. ఈ మ్యాచ్ లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. శ్రీలంక టీమ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ లో ఈ ఘటన జరిగింది. బ్లెయిర్ టిక్నర్ వేసిన ఈ ఓవర్ లో నాలుగో బంతిని లంక బ్యాటర్ కరుణరత్నే ఆడాడు. సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలోనే బంతిని వెంటనే అందుకున్న కివీస్ ఫీల్డర్ నాన్ స్ట్రైకర్ వైపు త్రో చేశాడు. వెంటనే బంతిని అందుకున్న టిక్నర్ స్టంప్స్ ను పడగొట్టాడు. దాంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ కు రిఫర్ చేశాడు. టిక్నర్ బెయిల్స్ పడగొట్టే సమయానికి కరుణరత్నే క్రీజుకు దూరంగానే ఉన్నాడు. దాంతో అతడు అవుట్ అని అందరు భావించారు. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.బంతి బెయిల్స్ కు తగలగానే వెలగాల్సిన జింగ్ బెయిల్స్ వెలగలేదు. దీంతో రూల్స్ ప్రకారం జింగ్ బెయిల్స్ వెలగని కారణంగా థంర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. అసలు విషయం ఏంటంటే? ఆ బెయిల్స్ తో ఛార్జింగ్ లేదట. దాంతో కివీస్ ఆటగాళ్లు ఒక్కసారిగా అవాక్కైయ్యారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Not out 🏏 due to dead battery 😂#SparkSport #NZvSL pic.twitter.com/tYE044lemd
— Spark Sport (@sparknzsport) March 25, 2023