టెస్టు క్రికెట్లోనే ప్రపంచ రెండో అత్యుత్తమ బ్యాటర్, ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్ ఒక స్వింగ్ బాల్‌కు కళ్లు తేలేశాడు. ఒక రకంగా చెప్పాలంటే.. అసలు ఎలా అవుట్ అయ్యానురా బాబు అంటే అయోమయంగా గ్రౌండ్‌లోనే నిల్చుండిపోయాడు. ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ రూట్‌ను విండీస్ బౌలర్ కీమర్ రోచ్ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో బోల్తా కొట్టించాడు.
అప్పటికే 17 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్‌ను ఆదుకునే బాధ్యతను రూట్ తన భుజాలపై వేసుకున్నాడు. కానీ కీమర్ రోచ్ రూట్ బ్యాటింగ్ కొంత సేపు పరిశీలించి.. అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటి వరకు ఆఫ్‌సైడ్ దూరంగా వస్తున్న బంతులను రూట్ ఆడకుండా వదిలేస్తున్నాడు. నాలుగైదు బంతులను అదే విధంగా వేసి రోచ్.. ఒక బంతిని ఇన్‌స్వింగర్‌గా వేశాడు. ఇంకేముంది.. రెప్పపాటులో బంతిపడి లోపలికి వచ్చి స్టెంప్స్ను పడగొట్టింది. ఆఫ్‌సైడ్ దూరంగా వెళ్తుందనుకున్న బంతి వికెట్లకు తాకడంతో రూట్ షాక్ అయ్యాడు. అలా ఎలా జరిగింది అన్నట్లు.. వికెట్లకేసి తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. కొద్దిసేపటి రియలైజ్ అయ్యి పెవిలియన్ బాట పట్టాడు.
14 బంతుల్లో 13 పరుగులు చేసిన రూట్ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. కాగా కీమర్ రోచ్ వేసిన అద్భుతమైన ఇన్‌స్వింగర్ బంతికి రూట్ అవుట్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ సూపర్ ఇన్స్వింగర్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇంగ్లాండ్ టీమ్ అంతా ఒక దగ్గర! కానీ.., ఆ ఒక్క ప్లేయర్ మాత్రం దూరంగా!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.