బెంగుళూరు వేదికగా నేడు, రేపు(శని, ఆదివారం) ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. మొత్తం పది జట్లు, 590 మంది ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొననున్నారు. నేడు చాలా మంది ఆటగాళ్లు ఏఏ జట్లతో చేరనున్నారో తేలిపోనుంది. ఏ ఆటగాడిపై కాసుల వర్షం కురవనుందో, ఏ ఆటగాడికి నిరాశ తప్పదో కూడా తేలిపోనుంది. కాగా ఈ వేలాన్ని టీవీ వీక్షకులు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో ప్రత్యేక్షప్రసారం చూడొచ్చు. హాట్స్టార్లో కూడా లైవ్ చూడొచ్చు. ఉదయం 11 గంటలకు వేలం ప్రారంభం కానుంది. అలాగే లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీమీని ఫాలో అవ్వండి.