హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరిగి దాదాపు మూడేళ్లకు పైనే అయిపోయింది. ఆదివారం జరిగే భారత్-ఆస్ట్రేలియా మూడో టీ20 కోసం క్రికెట్ ప్రేమికులు తెగ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొన్నమొన్ననే టికెట్స్ కోసం ఎంత రచ్చ జరిగిందో మీరే చూశారు కదా. ఓ ఏడెనిమిది మంది గాయపడ్డారు కూడా. టికెట్స్ సంపాదించిన వాళ్లు.. వాట్సాప్ లో స్టేటస్ లు పెట్టి మురిసిపోతున్నారు. మ్యాచుకి వెళ్లడానికి రెడీ అయిపోయారు సరే.. స్టేడియంలోకి కొన్ని వస్తువులు తీసుకెళ్లకూడదని మీకు తెలుసా? ఒకవేళ అలా చేస్తే మాత్రం మీరు అడ్డంగా బుక్కైపోతారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆసియాకప్ లో వైఫల్యం తర్వాత ఆస్ట్రేలియాతో భారత్ టీ20 సిరీస్ ఆడుతోంది. తొలి మ్యాచులో ఓడిపోయిన భారత్.. రెండో టీ20లో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. సిరీస్ ని 1-1తో సమం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో టీ20లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టే విజేతగా నిలుస్తుంది. అందుకు తగ్గట్లే రెండు జట్లు కూడా పకడ్బందీగా సిద్ధమైపోయాయి. ఇప్పటికే మైదానంలో ప్రాక్టీసులో మునిగిపోయాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 2500 మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక మ్యాచ్ చూడటానికి వెళ్లేవారి కోసం పోలీసులు కొన్ని కీలక సూచనలు చేశారు. స్టేడియంలోకి కొన్ని వస్తువులు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ ప్రకటన ప్రకారం.. కెమెరాలు, ఇతర రికార్డింగ్ సాధనాలు, ల్యాప్‌టాప్‌లు, సిగరెట్, లైటర్, అగ్గి పెట్టె, తుపాకులు, కత్తులు, ఇతర ఆయుధాలు, వాటర్ బాటిల్స్, మద్యం, ఇతర పానీయాలు, పెంపుడు జంతువులు, హెల్మెట్లు, పటాకులు, తినే పదార్థాలు, బ్యాక్‌ప్యాక్‌లు, సెల్ఫీ స్టిక్స్, మత్తు పదార్థాలు లాంటివి అనుమతించరు. ఒకవేళ మీరుగానీ మ్యాచ్ చూడటానికి వెళ్తే.. వీటిని మీ వెంట తీసుకెళ్లొద్దు. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Carrying these items inside the #stadium is strictly #prohibited. #INDvsAUS #3rdt20#INDvsAUST20I #Cricket #T20Cricket #HyderabadCricketAssociation #T20I #RohitSharma #ViratKohli𓃵 #TeamIndia @TelanganaDGP @TelanganaCOPs @BCCI @cyberabadpolice @hydcitypolice @VSrinivasGoud pic.twitter.com/WZYk2Ru2UN
— Rachakonda Police (@RachakondaCop) September 23, 2022
ఇదీ చదవండి: అధ్వానంగా ఉప్పల్ స్టేడియం.. టికెట్ దొరికినా.. మ్యాచ్ చూడటం కష్టమేనేమో?!