ఈ మధ్య కాలంలో నటీనటులు, పలువురు క్రీడాకారులు అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలవుతున్నారు. దీంతో వారిని ఎంతగానో ప్రేమించే పలువురు అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. ఎందుకంటే తన ఫేవరెట్ ప్లేయర్ ఎప్పుడు బాగుండాలనే కోరుకుంటారు. ఇప్పుడు పలువురు ఫుట్ బాల్ లవర్స్ అలానే తెగ బాధపడిపోతున్నారు. దానికి కారణం దిగ్గజ ఆటగాడు పీలే ఆస్పత్రిలో చేరడమే. గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన.. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరాడు. దీంతో అతడిని అభిమానించే వాళ్లందరూ కూడా తెగ ఆందోళన పడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అలానే పీలే త్వరగా కోలుకుని రావాలని కూడా పోస్టులు పెడుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. దిగ్గజ ఫుట్ బాలర్ పీలే అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన.. ఇలా సడన్ గా హాస్పిటల్ లో చేరడంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు. శరీరంపై వాపులు రావడం వల్లే ఆయన ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని, తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని పీలే కుమార్తె కెల్లీ స్పష్టం చేశారు. ఇక బ్రెజిల్ తరఫున మూడు ప్రపంచకప్ లు ఆడిన ఏకైక ప్లేయర్ పీలేనే కావడం విశేషం. మరోవైపు ఇటీవలే పీలేకు తుంటి సర్జరీ జరిగింది. దీని తర్వాతే ఆయన చాలా ఇబ్బందిపడుతున్నారు. నొప్పి తిరగబెట్టడంతో నడవడానికి కూడా అవస్థ పడుతున్నారు.
ప్రస్తుతం పీలే వయసు 82 ఏళ్లు. గతేడాది సెప్టెంబరులో పెద్దపేగు నుంచి కణితిని తొలగించారు. అప్పటినుంచి రెగ్యులర్ ట్రీట్ మెంట్ కోసం తరచుగా పీలేను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. తన హెల్త్ ప్రాబ్లమ్స్ పై పూర్తి అంచనా కోసం ఆయన చాలా టెస్టులు చేయించుకున్నారు. ఇక పీలే ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన మేనేజర్ కానీ, ప్రస్తుతమున్న ఆల్బర్ట్ ఐన్ స్టీన్ హాస్పిటల్ వర్గాలు కానీ ఏ వివరాలు చెప్పట్లేదు. అయితే పీలేకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక క్యాన్సర్ కు చేసే కీమోథెరపీ చికిత్సతోనూ ఆశించిన ఫలితాలు రావడం లేదని సమాచారం. ఇవన్నీ సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. దీంతో పలువురు ఫ్యాన్స్ తెగ ఆందోళన పడుతున్నారు. ఆయన త్వరగా కోలుకుని వస్తే చూడాలని ఉందంటూ పోస్టులు పెడుతున్నారు.
Pelé has been hospitalized in Brazil and his condition is ‘worsening,’ per @ESPNBrasil pic.twitter.com/vQPkv4MGmP
— B/R Football (@brfootball) November 30, 2022