Eoin Morgan Retires From International Cricket: క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే వారు ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. లేదంటే.. అర్థాంతరంగా కెరీక్‌కు గుడ్‌బై చెప్పాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. గత కొన్ని రోజులుగా పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు మోర్గాన్. ఆఖరికి నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్టుపైనా కూడా వరుసగా రెండు సార్లు డకౌటయ్యాడు. ఆపై గాయం కారణంగా మరి కొంత కాలం ఇబ్బంది పడ్డాడు. వయసు మీద పడటంతో.. ఇలా చేశాడనుకుంటే ఓకే కానీ.. మోర్గాన్ వయసు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే. ఇంత చిన్న వయసులోనే ఫామ్ కోల్పోవడంతో.. అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు మోర్గాన్. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించాడు. ఇప్పటికే అతడు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో మోర్గాన్.. స్వయంగా రిటైర్మెంట్ గురించి ప్రకటించాడు.
మంచి ఆటతో కెరీర్‌లో శిఖరాగ్రానికి చేరుకుని కెరీర్ చివర్లో బ్యాడ్ ఫామ్‌తో ఇబ్బంది పడుతూ.. జట్టుకు భారంగా మారి సెలెక్టర్లు పక్కనపెట్టాలా చేసుకుని అవమానం పొందేకంటే.. గౌరవంగా తప్పుకుంటే ఉత్తమంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పాటించినట్లు అర్థమవుతోంది. భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీసే మోర్గాన్ కు చివరిదని అంతా భావించారు. కానీ, మోర్గాన్ అనూహ్యంగా తన రిటైర్మెంట్ ను భారత్ తో సిరీస్ కంటే కూడా ముందే ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేశాడు.
ఇది కూడా చదవండి: IPL వేలం: భారీ షాక్ అమ్ముడుపోని కెప్టెన్!
Thank you Morgan, memories will stay forever – the man who changed England white ball cricket. pic.twitter.com/I6aR4G6Bfn
— Johns. (@CricCrazyJohns) June 28, 2022
ఐర్లాండ్ లో పుట్టి.. ఇంగ్లండ్ కెప్టెన్ గా ఎదిగి
ఇయాన్ మోర్గాన్ ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో జన్మించాడు. మొదట ఆ జట్టు తరఫునే అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించాడు. 2006లో ఐర్లాండ్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఐర్లాండ్ తరఫున మోర్గాన్ 23 వన్డేలు ఆడి 744 పరుగులు సాధించాడు. అనంతరం ఐర్లాండ్ కు గుడ్ బై చెప్పి.. 2010లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ తరఫున ఎంట్రీ ఇచ్చాక మోర్గాన్ కెరీర్ ఊపందుకుంది. మొదట్లో ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా ఉన్న అతడు టెస్టుల్లోనూ ఇంగ్లండ్ తరఫున రాణించాడు. 2010-12 మధ్య 16 టెస్టులు ఆడిన అతడు 16 మ్యాచ్ ల్లో 700 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండటం విశేషం. అలెస్టర్ కుక్ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మోర్గాన్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 2016లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను ఫైనల్ వరకు చేర్చాడు. ఇక 2019లో జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను చాంపియన్‌గా నిలిపి.. అందని ద్రాక్షలా ఉన్న విశ్వవిజేత అనే ట్యాగ్ దక్కేలా చేశాడు. ఇంగ్లండ్‌ను అత్యధికంగా 126 వన్డేల్లో కెప్టెన్‌గా నడిపించాడు. టి20ల్లో 72 సార్లు ఇంగ్లండ్‌కు కెప్టెన్ గా వ్యవహరించాడు.
ఇది కూడా చదవండి: Hardik Pandya: రోహిత్, రాహుల్, కోహ్లీలను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి చేరిన పాండ్యా!
ఐపీఎల్‌లోను రాణించాడు…
ఆటగాడిగా కూడా ఇయాన్ మోర్గాన్ అద్భుతంగా రాణించాడు. 248 వన్డేలు ఆడిన మోర్గాన్ 7,701 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు.. 47 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20ల్లో 115 మ్యాచ్ లు ఆడి.. 2,458 పరుగులు చేశాడు. ఇందులో 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లోనూ మోర్గాన్ ఫర్వాలేదనిపించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ల తరఫున ఆడిన అతడు.. కేకేఆర్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ప్రస్తుతం ఫామ్ కోల్పోవడంతో… రిటైర్మెంట్ ప్రకటించాడు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: India VS England: ఇంగ్లండ్‌లోని టీమిండియా ఆటగాళ్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ!
✅ Most ODI runs for England
✅ Most Men’s T20I runs for England
🏆 ODI World Cup winning captainHe changed the way England played cricket and did it with great success 💥
An England great – Captain Morgan! 🙌🏴#EoinMorgan #England #CricketTwitter pic.twitter.com/ym54JptznV
— Sportskeeda (@Sportskeeda) June 28, 2022