సాధారణంగ క్రికెటర్లకు కుటుంబంతో, స్నేహితులతో కలిసి సరదాగా గడిపే సమయం తక్కువ. తీరికలేని షెడ్యూల్ తో వివిధ దేశాల్లో పర్యటిస్తుంటారు ఆటగాళ్లు. అయితే క్రికెట్ వీడ్కోలు పలికిన తర్వాత సమయం మెుత్తాన్ని కుటుంబంతో, ఫ్రెండ్స్ తో.. తమకు ఇష్టమైన ఆటలతో జీవితాన్ని సంతోషంగా గడుపుతుంటారు. ప్రస్తుతం ఇదే పనిచేస్తున్నాడు టీమిండియా మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని. ఓ పక్క ఫ్యామిలీకి సమయం కేటాయిస్తునే తనకు ఇష్టమైన టెన్నిస్ ఆటను కూడా ఆడుతున్నాడు. అదీ కాక ఫ్రెండ్స్ తో పార్టీని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగ ఓ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో ధోని చేసిన డ్యాన్స్ నెట్టింట వైరల్ గా మారింది.
మహేంద్ర సింగ్ ధోని.. మిస్టర్ కూల్ గా.. డాషింగ్ ఫినిషర్ గా క్రికెట్ ప్రపంచానికి సుపరిచితుడు. అయితే ధోనిలో ఉన్న మరో కోణాన్నిఅభిమానులకు పరిచయం చేశాడు. తాజాగా దుబాయ్ లో తన ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యాడు మహి. హాలీవుడ్ స్టైలీష్ లుక్ లో అదరగొట్టాడు ధోని. లుక్ తోనే కాక తన డ్యాన్స్ తో కూడా పార్టీలో రచ్చ రచ్చ చేశాడు. స్టార్ ర్యాప్ సింగర్ బాద్ షా పాటలు పాడుతుంటే టీమిండియా ఆటగాళ్లు అయిన హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్ లతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోని ధోని భార్య సాక్షిసింగ్ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ధోనిని మైదానంలో కెప్టెన్ కూల్ గా చూసిన అభిమానులకు ఇదో రకమైన సర్ఫ్రైజ్. ఇక న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ తర్వాత పాండ్యాకు, ఇషాన్ కిషన్ లకు వన్డే సిరీస్ కు విశ్రాంతి ఇచ్చారు సెలక్టర్లు. దాంతో నేరుగా వీళ్లిద్దరు దుబాయ్ వచ్చి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు.
Video from Last Night 😍🤩#MSDhoni • @msdhoni • #Dhoni pic.twitter.com/sQthgftbYd
— TELUGU MSDIANS🦁™ (@TeluguMSDians) November 27, 2022
Video of the day is here! 🕺💥@MSDhoni | #MSDhoni | #Dhoni pic.twitter.com/CCj4zOLQjV
— DHONI Era™ 🤩 (@TheDhoniEra) November 27, 2022