ఇన్స్టాగ్రామ్ రీల్స్‌తో తనలో దాగిఉన్న కొత్త టాలెంట్‌ను బయటపెట్టే ఆస్ట్రేలియా స్టార్ క్రికెట్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఏకంగా మ్యాచ్ మధ్యలోనే, గ్రౌండ్‌లోనే తన నాట్యకళా ప్రదర్శన చూపించాడు. అది కూడా పాకిస్థాన్‌లో పంజాబీ డ్యాన్స్ చేసి మరి క్రికెట్ అభిమానులకు తన టాలెంట్‌ను ప్రత్యక్షంగా చూపించాడు. సదరు వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయగా ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య జరగుతునన తొలి టెస్ట్ మ్యాచ్ చివరి రోజు ఆటలో ఫీల్డింగ్ సమయంలో డేవిడ్ వార్నర్ డాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. అది కూడా పాకిస్థాన్‌లో భారత్‌కు చెందిన పంజాబీ డ్యాన్స్ చేయడం విశేషం.
డ్యాన్స్ చేస్తూ తోటి ఆటగాళ్లతోపాటు పాటు మైదానానికి వచ్చిన ప్రేక్షకులను కూడా వార్నర్ ఆనందాన్ని పంచాడు. తన బ్యాటింగ్‌తోనే కాకుండా ఇలా అద్భుత డాన్స్తోకూడా వార్నర్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కాగా మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు. బెంగుళూరు వేదికగా జరిగిన మెగా వేలంలో రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో ఇప్పటివరకు 150 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 41 సగటుతో 5,449 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 126 పరుగులు. రానున్న ఐపీఎల్లో బ్యాటింగ్‌తో పాటు వార్నర్ డాన్స్ చూసే అవకాశం ఉంటుంది. మరి డేవిడ్ భాయ్ డాన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The crowd and the camera love @davidwarner31 🕺🏼#BoysReadyHain I #PAKvAUS pic.twitter.com/UWQYAjTLsk
— Pakistan Cricket (@TheRealPCB) March 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.