ప్రస్తుత క్రికెట్ లో విరాట్ కోహ్లీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా రికార్డ్స్ నెలకొల్పాడు కాబట్టి. అయితే ఓ విషయంలో మాత్రం బాబర్ ఆజమ్ బెటర్ అని స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ప్రస్తుత క్రికెట్ లో ఎవరు అద్భుతమైన ఆటగాడు ఉన్నాడా అంటే చాలామంది చెప్పేమాట విరాట్ కోహ్లీ. గతంలో ఉన్న దిగ్గజాలు గురించి కాస్త వదిలేస్తే.. ప్రస్తుత తరానికి మాత్రం కోహ్లీనే ది గ్రేట్. ఈ మధ్య ఓ రెండు మూడేళ్లు ఫామ్ లో లేకపోయి ఉండొచ్చు గానీ ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే మాత్రం ఆపడం ఎవరివల్లా కాదు. అయితే పాక్ జట్టులోని బాబర్ ఆజమ్ ని అప్పుడు విరాట్ కోహ్లీతో పోల్చి పలువురు క్రికెటర్లు కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరిగినంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అది కాస్త ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా తరఫున అద్భుతమైన రికార్డులు నెలకొల్పిన కోహ్లీ.. తన బ్యాటింగ్ తో అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాడు. మరీ ముఖ్యంగా కోహ్లీ కవర్ డ్రైవ్ షాట్ కొడితే అలా చూస్తూ ఉండిపోవచ్చు. ఇప్పుడు దాని గురించే సాతాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం పాక్ ప్రీమియర్ లీగ్ లో ముల్తాన్ సుల్తాన్ జట్టుకు ఆడుతున్న మిల్లర్.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మరి బాబర్ ఆజమ్, కోహ్లీలలో ఎవరి కవర్ డ్రైవ్ బాగుంటుంది ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. ఈ క్రమంలో కోహ్లీ కంటే బాబర్ ఆజమ్ కవర్ డ్రైవ్ షాట్ బాగుందని అన్నాడు. బాబర్ కే ఓటేస్తానని అన్నాడు. మరోవైపు షాహీన్ అఫ్రిది, బుమ్రాలలో ఎవరి యార్కర్లు బాగుంటాయి అన్న ప్రశ్నకు మాత్రం బుమ్రా అని సమాధానమిచ్చాడు.
ఇలా మిల్లర్ కామెంట్స్ చూసి నెటిజన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఎంత పాక్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతుంటే మాత్రం కోహ్లీని తక్కువ చేసి మాట్లాడుతావా అంటూ రెచ్చిపోతున్నారు. బుమ్రా గురించి కరెక్ట్ గా చెప్పి.. కోహ్లీ గురించి ఎందుకు తప్పు చెప్పావ్ అని అంటున్నారు. మరి పీఎస్ఎల్ కోసం భారత స్టార్ క్రికెటర్లను కించపరచడం కరెక్ట్ కాదని అంటున్నారు. ప్రస్తుతం ఇవి కాస్త క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా పలువురు మాజీ క్రికెటర్లు, నిపుణులు మాత్రం.. కోహ్లీ-బాబర్ ని పోల్చడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. కోహ్లీ తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించాడని, బాబర్ మాత్రం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడని గుర్తుచేస్తున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే మిల్లర్ వ్యాఖ్యలపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.