టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ లో అజింక రహానే ఒక్కరు. భారత జట్టులో రాహుల్ ద్రావిడ్ తర్వాత అంతటి కామ్ పర్సన్ రహానే. తన కామ్ అండ్ కూల్ కంపోజర్ తో టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాల్ని రహానే అందించాడు. కొన్ని మ్యాచ్ లకు టీమ్ ఇండియా తరపున కెప్టన్ గా వ్యవహరించి అద్భుత విజయాలు సొంతం చేసుకున్నాడు. టీమ్ ఇండియా ఆటగాళ్లలో రహాన్ చాలా సైలెంట్ పర్సన్ గా కనిపిస్తాడు. అది వాస్తవం.. అయితే పర్సనల్ లైఫ్ లో మాత్రం రహానే అంత కామ్ కాదండోయ్. ఆయన ప్రేమ కథ తెలిసిన ఎవరైనా.. వామ్మో రహానే.. ఇంత కథ నడిపావా? అని అన్సాలిందే. అతడి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం
అజింకా రహానే.. తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా దొపావ్కర్‌ను సెప్టెంబర్ 26, 2014లో పెళ్లి చేసుకున్నాడు. అయితే రాధికా, రహానే లవ్ కమ్ ఆరేంజ్డ్ మ్యారేజ్ వెనక ఓ పెద్ద ఇంట్రెస్టింగ్ ప్రేమ కథ ఉంది. రహానే భార్య రాధిక వాళ్ల సొంత ఊరు పూణే. అయితే రాధికా ఫ్యామిలీ పూణే నుంచి ముంబైకి వెళ్లి.. అక్కడ సెటిల్ అయ్యింది. ముంబైలో రహానే ఇంటి పక్కనే రాధికా వాళ్ల ఫ్యామిలీ ఉండేది. ఈ క్రమంలో రాధికా, రహానే మంచి స్నేహం ఏర్పడింది. వారిద్దరి స్నేహం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇద్దరు అనుకుని మరీ.. ఒకే కాలేజీలో జాయిన్ అయ్యారు. రోజూ కాలేజీకి కలిసి వెళ్లి వస్తుండే వాళ్లు. అయితే వీరి ప్రేమ గురించి ఇరు కుటుంబాల్లోని పెద్దలకు తెలీదు.
ఇదీ చదవండి: ఇంజమామ్ నా దగ్గరకు వచ్చి ‘సచిన్’ కు అలా వేయమని చెప్పేవాడు: షోయబ్ అక్తర్
ఇద్దరు కాలేజీకని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరి, బయట సినిమాలకు, పార్కులకు తెగ తిరుగుతూ ఎంజాయ్ చేసే వాళ్లు. అలా ఓ రోజు కూడా ఈ ప్రేమ పక్షులు కాలేజీ డుమ్మా కొట్టి… సినిమాకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరిని రోడ్డు మీదే రాధిక తల్లి చూసింది. రాధిక వాళ్ల అమ్మ నుంచి తప్పించుకునే క్రమంలో రహానే ఆటోను కూడా ఢీకొట్టాడంట. ఈ విషయాన్ని ఓ ఇంటర్య్యూలో రహానే స్వయంగా వెల్లడించాడు.
ఈ సంఘటన తర్వాత రహానే రాధికల ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో తెలిసిపోయింది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్ లో అందర్నీ ఆకట్టుకునే రహానే.. తన ప్రేమ పెళ్లి విషయంలో ఇంత కథ నడిపాడు. ప్రస్తుతం రహానే రాధికాలకు ఆర్య అనే పాప ఉంది. మరి.. రహానే లవ్ స్టోరీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.