భారత్ స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ తన భార్య హసిన్ జహాన్ మధ్య కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతున్నది. షమీ తనను అధనపు కట్నం కోసం వేదించాడని, బిసిసిఐ సంబంధిత పర్యటనల్లో బోర్డు అందించిన గదుల్లో వేశ్యలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపణలు చేసింది. ఇదే విషయమై క్రికెటర్ షమీని అరెస్టు చేయాలంటూ భార్య హసిన్ జహాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

హసిన్ జహాన్ 2018లో జాదవ్‌పూర్‌లో మహమ్మద్ షమీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో షమీపై 2019లో ఆగస్టు 29న అలీపూర్ అదనపు ఛీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అరెస్ట్ వారెంట్ పై షమీ సెషన్స్ కోర్టులో సవాల్ చేశాడు. దీంతో అరెస్ట్ వారెంట్ పై స్టే విధించింది. దీని తరువాత షమీ భార్య కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. అయితే అరెస్ట్ వారెంట్ పై స్టే ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఇదిలా ఉండగా చట్టం ప్రకారం ఏ సెలబ్రిటీకి ప్రత్యేక హోదా రాకూడదని హసిన్ జహాన్ పిటిషన్ లో పేర్కొంది. ఒకేవిధమైన విడాకుల చట్టాన్ని రూపొందించాలని మహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ వేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎక్స్‌ట్రా జుడిషియల్ తలాక్, తలాక్-ఉల్-హసన్ లాంటి ఏకపక్ష విధానాలతో విసుగెత్తిపోయినట్లు షమీ భార్య తన పిటిషన్ లో వెల్లడించారు. విడాకుల అంశాలపై ఉన్న ఇతర పిటీషన్లతో పాటు షమీ భార్య అభ్యర్థనను కూడా సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ప్రక్రియ చేపట్టింది.
అడ్వకేట్ దీపక్ ప్రకాశ్ ఈ అభ్యర్థనను ఫైల్ చేశారు. 2022, జూలై 23వ తేదీన తలాక్ ఉల్ హసన్ కింద తనకు క్రికెటర్ షమీ నుంచి విడాకుల పిటిషన్ అందినట్లు ఆమె తెలిపారు. తలాక్ ఉల్ హసన్ కింద అనేక మంది విడాకులు తీసుకున్నారని షమి భార్య ఆరోపించారు. లింగ బేధం లేకుండా, మత తటస్టమైన ఏకీకృత విడాకుల విధానాన్ని తయారు చేయాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు. మహమ్మద్ షమీ ప్రస్తుతం ఐపిఎల్ 2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు.