క్రికెట్ చాలా సీరియస్ గేమ్. గెలవడం కోసం ఆటగాళ్లు స్లెడ్జింగ్ దగ్గర నుంచి ఏం చేయడానికైనా సరే వెనుకాడరు. మనం ప్రపంచకప్ టోర్నీల దగ్గర నుంచి ద్వైపాక్షిక సిరీసుల్లో ఇలాంటివి జరగడం చాలాసార్లు చూశాం. చూస్తూనే ఉన్నాం. అలా అని ఎప్పుడూ కూడా అలానే ఉంటుందే కాదు కొన్నిసార్లు నవ్వు తెప్పించే సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా సేమ్ అలాంటిదే రిపీటైంది. దీనిపై నెటిజన్స్ కూడా అంతే ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియో వైరల్ గా మారడంతో.. ఇది కాస్త వెలుగులోకి వచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా శుక్రవారం రెండో టీ20 జరిగింది. ఇందులోనూ గెలిచిన ఆసీస్.. రెండు మ్యాచుల టీ20 సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది. ఆసీస్ జట్టులోని విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ అయితే ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. 41 బంతుల్లో 75 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అంతా బాగానే ఉంది. మ్యాచ్ కూడా అయిపోయింది కానీ ఆసీస్ వికెట్ కీపర్ మథ్యూ వేడ్ ఫన్నీ వికెట్ కీపింగ్ మాత్రం నెటిజన్స్ కి రిజిస్టర్ అయిపోయింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. వెస్టిండీస్ జట్టుకి 66 పరుగులు అవసరమైన దశలో ఆడమ్ జంపా బౌలింగ్ చేస్తున్నాడు. హోసెన్ క్రీజులో ఉన్నాడు. అయితే బంతి వేసే క్రమంలోనే ఈ విండీస్ బ్యాటర్, పూర్తి అడ్డుగా నిలబడిపోయాడు. దీంతో వికెట్ కీపర్ వేడ్ కి ఏం బంతి ఎక్కడ వేస్తాడు ఏంటనేవి కనిపించవు. కాబట్టి క్రీజు నుంచి పూర్తిగా బయటకొచ్చేసి ఫన్నీ పోజిచ్చాడు. ఈ వీడియో చూసి నెటిజన్స్.. వికెట్ కీపర్ కి సైడ్ ఇవ్వు బ్యాటర్ బ్రో, వేడ్ యూ ఆర్ సూపర్ ఫన్నీ అని కామెంట్స్ పెడుతున్నారు. మరి వేడ్ వెరైటీ కీపింగ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.