వైఎస్సార్.. రెండు తెలుగు రాష్ట్రల రాజకీయాల్లో ఈ పేరుకి ఉన్న క్రేజ్ గురించి, రేంజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన హఠాన్మరణంతో తెలుగు రాజకీయాల రూపు రేఖలు మారిపోయాయి. వైఎస్సార్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సవాళ్ళను అధిగమించి ఏపీలో సీఎం అయ్యారు. కానీ.., జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీని ప్రజల్లో నిలిపింది మాత్రం వైఎస్సాఆర్ తనయురాలు షర్మిల మాత్రమే.
అప్పట్లో ఆమె సుదీర్ఘ పాదయాత్ర ఓ సంచలనం. “జగనన్న వదిలిన బాణాన్ని నేను” అంటూ షర్మిల ప్రత్యర్థి పార్టీలకి చెమటలు పట్టించారు. ఈ లెక్కన చూస్తే వైసీపీ ప్రస్థానంలో షర్మిల కష్టాన్ని తక్కువ చేయడానికి వీలు లేదు. కానీ.., గత కొన్ని నెలలుగా షర్మిల వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణలో ఆమె సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. జగన్ పైనా విమర్శలు ఎక్కు పెడుతూ వస్తున్నారు. దీంతో.. వైఎస్సార్ కుటుంబంలో ఏమి జరుగుతోంది? జగన్, షర్మిల మధ్య గొడవలు జరిగాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకాలం ఈ వార్తలపై స్పందించని షర్మిల ఇప్పుడు తొలిసారి పెదవి విప్పారు.
ప్రముఖ మీడియా అధినేత చేసే ఇంటర్వ్యూకి తాజాగా షర్మిల గెస్ట్ గా వచ్చారు. ఆ ఎపిసోడ్ ప్రోమో తాజాగా సోషల్ మీడియాలో విడుదలై.. సంచలనాలకి తెర లేపుతోంది. ఈ ఇంటర్వ్యూలో జగన్ తో గొడవ ఏంటి అంటూ అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం ఇచ్చారు షర్మిల. “పార్టీలో రామకృష్ణారెడ్డి అన్న నాకు సంబంధం లేదు అన్నారు. కానీ.., ఇదే జగన్ మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్ కోసం నా శక్తికి మించి పని చేశాను. ఇప్పుడు మాత్రం వారికి అవసరం లేకుండా పోయాను” అంటూ కుండబడ్డలు కొట్టినట్టు సమాధానం చెప్పారు షర్మిల. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ప్రోమోనే ఈ రేంజ్ లో ఉంటే, మొత్తం ఇంటర్వ్యూలో ఎలాంటి నిజాలు, విశేషాలు ఉంటాయో చూడాలి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.