రాజకీయాలు శత్రువులను మిత్రులుగా, మిత్రులను శత్రువులుగా మారుస్తుందని అంటారు. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అలీ లేని పవన్ కళ్యాణ్ సినిమా లేదు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అలీ ఉండాల్సిందే. అంత బాండింగ్ ఉండేది వీళ్ళ మధ్య. అలీకి సంబంధించిన కుటుంబ వేడుకలకైనా పవన్ కళ్యాణ్ వెళ్లేవారు. అయితే అలీ కూతురు వివాహానికి పవన్ కళ్యాణ్ హాజరవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే అలీ కూతురు వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వేడుకలో కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలీ వైసీపీ పార్టీకి చెందిన నేత కావడం వల్లే పవన్ కళ్యాణ్ ఈ పెళ్ళికి వెళ్లలేదని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే.. అలా ఏం లేదు.. రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల వెళ్లలేకపోయారు అని మరి కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలీకి పవన్ అన్నా, పవన్ కి అలీ అన్నా ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని, దీనికి రాజకీయ రంగు పూలమాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ అలీ కూతురు వివాహానికి వెళ్లలేకపోయారని అంటున్నారు. మరి ఈ విషయంపై ఈ అభిప్రాయం ఏమిటి?
రాజకీయాలు పక్కన పెట్టి తోటి స్నేహితుడి కూతురి పెళ్ళికి వెళ్లడం తెలియదా @PawanKalyan ? Cinema Industry intha Ghoram enti raa ?
— Ram (@iamSidde) November 29, 2022