Rahul Gandhi: దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరు గాంచిన సంగతి తెలిసిందే. రాహుల్ కాంగ్రెస్ పార్టీ మీద కంటే పార్టీలు చేసుకోవటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఇది నిజమే అన్నట్లు.. రాహుల్ వీలు చిక్కినప్పుడల్లా వెకేషన్ల పేరిట విదేశాలకు ఎగిరిపోతుంటారు. తాజాగా, రాహుల్‌కు సంబంధించిన ఓ వీడియో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. చైనా మహిళా దౌత్యవేత్త యో యాంకీతో రాహుల్ నైట్‌క్లబ్‌లో ఉన్న వీడియో అది. రాహుల్ గాంధీ నిన్న ఓ పెళ్లి వేడుకకు హాజరు కావటానికి నేపాల్ వెళ్లారు.
సాయంత్రం 4.40కి ఖాట్మాండ్ చేరుకున్నారు. అక్కడి మారియట్ హోటల్‌లో బస చేశారు. ప్రముఖ నేపాల్ జర్నలిస్ట్ సుమ్నిమా ఉదాస్ పెళ్లికి హాజరయ్యారు. ఆ రాత్రే ఖాట్మాండ్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో చైనా మహిళా దౌత్యవేత్త యో యాంకీతో పార్టీ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాహల్ గాంధీ, యోయాంకీతో క్లోజ్‌గా ఉన్న ఈ వీడియో కారణంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం చెలరేగుతోంది. యో యాంకీ గతంలో నేపాల్ ప్రధానితో పాటు పలువురు నేపాల్ రాజకీయ నాయకులపై హనీ ట్రాప్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#RahulGandhi enjoying Party with Chinese Ambassador in Nepal
Pappu ka Hath Chinese Ke Sath pic.twitter.com/2PEMh4wrld— अमित शर्मा (@AmitsharmaGRENO) May 3, 2022
ఇవి కూడా చదవండి :