విరాట్ కోహ్లీ కూతురిని అత్యాచారం చేస్తామని బెరింపులు వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో విరాట్ కోహ్లీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. ‘డియర్ విరాట్.. కొంతమంది మనుషులు పూర్తిగా ద్వేషంతో నిండిపోయి ఉంటారు. ఎందుకంటే వారికి ఎవర్వూ ప్రేమను పంచరు. వాళ్లను క్షమించు. ప్రొటెక్ట్ ద టీమ్’ అంటూ ట్వీట్ చేశాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయినా తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో టీమిండియా పేసర్ మొహమ్మద్ షమిని టార్గెట్ చేసి దాడికి దిగారు.
దీంతో తన జట్టు సభ్యుడికి కెప్టెన్‌గా తన వంతు మద్దతు తెలుపుతూ దూషణకు దిగిన వారికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. దీంతో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మీ కూతురిని అత్యాచారం చేస్తాం అంటూ కొంతమంది బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా కోహ్లీకి మద్దతు తెలిపారు. విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీని నెటిజన్లు అభినందిస్తున్నారు. విరాట్‌కు మద్దతు తెలిపిన మొదటి రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీనే అంటూ ప్రశంసిస్తున్నారు.
Dear Virat,
These people are filled with hate because nobody gives them any love. Forgive them.
Protect the team.
— Rahul Gandhi (@RahulGandhi) November 2, 2021
Rahul Gandhi is the only leader standing with Virat Kohli pic.twitter.com/w9OfN24sng
— CONGRESS FOREVER (@MyLeaderRahul) November 2, 2021
“Rahul” the true voice of India…
— Kuldeep Bishnoi (@bishnoikuldeep) November 2, 2021