ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో సోమవారం ఉదయం కన్నుమూశారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త తెలుగు ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన హఠాన్మరణం.. కుటుంబ సభ్యులతో పాటు పార్టీ శ్రేణులు, అభిమానులను తీవ్రంగా కలచి వేస్తోంది. ఆయన మృతికి పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. సొంత అన్నను కోల్పోయినట్లు ఉందని అదే జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భావోద్వేగంగా మాట్లాడారు. అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దగ్గరుండి చూసుకున్నారు.
ఈ క్రమంలో గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని నెల్లూరు నుంచి ఉదయగిరిలోని మెరిట్స్ తీసుకునే వెళ్తున్న సందర్భంలో అనిల్ కుమార్ యాదవ్ వాహనం వెంబడి పరుగులు తీశారు. మంత్రి మేకపాటి తుది సంస్కారానికి ఏర్పాట్లతో పాటు వీడ్కోలు పలకడానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బైక్ పై భారీ ర్యాలీ నిర్వహించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అభిమాన నేతను కడసారి చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.
సీఎం వైఎస్ జగన్, మంత్రులు, కుటుంబ సభ్యులు, వేలాదిగా తరలి వచ్చిన అభిమానుల అశ్రునయనాలతో మంత్రి గౌతమ్‌రెడ్డికి తుది వీడ్కోలు పలికారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్రలో పరుగు తీసిన అనిల్ కుమార్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. గౌతమ్ రెడ్డిపై అనిల్ కుమార్ యాదవ్ కి ఉన్న అభిమానం అలాంటి అని కొందరు నెటిజన్లు అభిప్రాయాపడుతున్నా. మరి..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.